ఆర్థిక మంత్రి జైట్లీతో రాజన్ భేటీ | Raghuram Rajan calls on Arun Jaitley ahead of RBI monetary policy | Sakshi
Sakshi News home page

ఆర్థిక మంత్రి జైట్లీతో రాజన్ భేటీ

Published Thu, May 26 2016 2:37 AM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

ఆర్థిక మంత్రి జైట్లీతో రాజన్ భేటీ - Sakshi

ఆర్థిక మంత్రి జైట్లీతో రాజన్ భేటీ

న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ బుధవారం సమావేశమయ్యారు. జూన్ 7న పాలసీ సమీక్ష నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు వంటి కీలకాంశాలపై వీరిరువురి మధ్యా చర్చ జరిగిందని భావిస్తున్నారు. సెప్టెంబర్ 4తో ముగుస్తున్న రాజన్ పదవీకాలాన్ని పొడిగించరాదని, అధిక వడ్డీరేట్ల వ్యవస్థతో ఆయన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టారని ఒకపక్క బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి విమర్శల నేపథ్యంలో జైట్లీ-రాజన్ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.  సమావేశానంతరం విలేకరులతో మాట్లాడటానికి జైట్లీ నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement