ఆర్బీఐ పేరుతో మోసాలు.. జాగ్రత్త | RBI Governor Raghuram Rajan cautions public against frauds in RBI's name | Sakshi
Sakshi News home page

ఆర్బీఐ పేరుతో మోసాలు.. జాగ్రత్త

Published Tue, Apr 12 2016 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

ఆర్బీఐ పేరుతో మోసాలు.. జాగ్రత్త

ఆర్బీఐ పేరుతో మోసాలు.. జాగ్రత్త

రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్వయంగా బ్యాంకింగ్ రెగ్యులేటర్ చీఫ్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు.

గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరిక
ముంబై: రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్వయంగా బ్యాంకింగ్ రెగ్యులేటర్ చీఫ్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. రాజన్ సోమవారం నాడు ఇక్కడ ఆర్థిక లావాదేవీల సరళీకరణకు ఉద్దేశించిన- నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) యాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన పేరుతో, సెంట్రల్ బ్యాంక్ పేరుతో కొన్ని ఈ-మెయిల్స్‌ను పంపుతూ... తప్పుడు మార్గంలో డబ్బును పొందేందుకు మోసపూరిత శక్తులు ప్రయత్నిస్తున్న ఘటనలు రెగ్యులేటర్ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.

ఆయా మోసపూరిత చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘మీరు  ఒక లాటరీలో ఎంపికయ్యారు. మీ కోసం డబ్బు ఇప్పటికే విడుదలై... ఆర్‌బీఐ వద్ద సిద్ధంగా ఉంది. రూ.20,000  ప్రాసెస్ ఫీజు పంపితే  రూ. 50 కోట్లు మీ వశం అవుతాయి’ అంటూ నా నుంచి మీకు ఏదైనా మెస్సేజ్ వస్తే దానిని కచ్చితంగా మోసపూరితమైనదిగా భావించండి. మా వద్ద 360 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ మారకపు నిల్వలు ఉన్నాయి. 8 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను నిర్వహిస్తున్నాం. మీ డబ్బును మేము కోరుకోవడం లేదు. మీ డబ్బు మాకు అక్కర్లేదు.’ అని హాస్యోక్తిగా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement