
ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లు యథాతధం
ముంబై: భారతీయ కేంద్ర బ్యాంకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ద్రవ్యపాలసీని ప్రకటించింది. రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో రెండు రోజుల భేటీ అనంతరం ద్రవ్యవిధాన కమిటీ వడ్డీరేట్లపై తమ నిర్ణయాన్ని వెల్లడించింది. అంచనాలకు కనుగుణంగానే ఆర్‌బీఐ స్టేటస్ కో వ్యూహాన్నే అనుసరించింది. మానిటరీ పాలసీ కమిటిలో అయిదుగురు సభ్యులు యథాతధ పాలసీకే ఓటు వేసారు.
బుధవారం ప్రకటించిన రివ్యూ పాలసీలో రెపో రేటు, రివర్స్ రెపో రేటును యథాతధంగానే ఉంచింది. రెపో రేటును 6.25 శాతం వద్ద, రివర్స్ రెపో రేటును వద్ద ఎలాంటి మార్పులేకుండా ఉంచింది. రెపో రేటు లేదా కీలక రుణాలపై 6.25 శాతం వడ్డీ రేటును కొనసాగించింది. రివర్స్ రెపో 6 శాతం వద్దే కొనసాగనుంది. దీంతో కీలక వడ్డీరేటు 6 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరింది. అయితే ఎస్‌ఎల్‌ఆర్ 50 బీపీఎస్ పాయింట్లను కట్ చేసింది.