డిపాజిట్ రేట్లను పావు శాతం తగ్గించిన ఓబీసీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) ఎంపిక చేసిన (91-179 రోజులు) మెచ్యూరిటీస్‌ల డిపాజిట్ రేట్లను 0.25 శాతం తగ్గించింది. దీంతో ఈ రేటు 7 శాతానికి దిగింది. అలాగే 270 రోజుల మెచ్యూరిటీ డిపాజిట్ల వడ్డీ రేట్లు కూడా గతంతో పోలిస్తే 0.25 శాతం తక్కువతో 7.5 శాతంగా ఉండనున్నాయి. బీఎస్‌ఈలో ఓబీసీ షేరు ధర 5 శాతం పెరిగి రూ.182 వద్ద ముగిసింది.