
జనవరిలో కాల్ డ్రాప్స్‌పై డ్రైవ్ టెస్ట్: ట్రాయ్
టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ మళ్లీ కాల్ డ్రాప్స్‌పై డ్రైవ్ టెస్ట్‌ను నిర్వహించనుంది. ఇది జనవరిలో ప్రారంభమయ్యే అవకాశముంది. ట్రాయ్.. ఈ డ్రైవ్ టెస్ట్‌లో భాగంగా రిలయన్స్ జియోతోపాటు వివిధ టెలికం
న్యూఢిల్లీ: టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ మళ్లీ కాల్ డ్రాప్స్‌పై డ్రైవ్ టెస్ట్‌ను నిర్వహించనుంది. ఇది జనవరిలో ప్రారంభమయ్యే అవకాశముంది. ట్రాయ్.. ఈ డ్రైవ్ టెస్ట్‌లో భాగంగా రిలయన్స్ జియోతోపాటు వివిధ టెలికం కంపెనీలకు సంబంధించిన పలు నెట్‌వర్క్ అంశాలతోపాటు కాల్ డ్రాప్స్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుంటుంది. ‘డ్రైవ్ టెస్ట్ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ఇప్పటికే దీన్ని నిర్వహించి ఉండాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. డ్రైవ్ టెస్ట్‌ను జనవరిలో ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్వహిస్తాం’ అని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ తెలిపారు. కాగా ట్రాయ్ ఇదివరకు 12 పట్టణాల్లో డ్రైవ్ టెస్ట్‌ను నిర్వహించింది. ఈసారి డ్రైవ్ టెస్ట్‌లో ఈ ప్రాంతాలతోపాటు హైవేలను, ఇతర ఏరియాలను కవర్ చేసే అవకాశముందని చెప్పారు.