రెరా తొలి తీర్పు: రూ. 26లక్షల పరిహారం | RERA first verdict comes in home buyer's favour, builder asked to return Rs 26 lakh to customer | Sakshi
Sakshi News home page

రెరా తొలి తీర్పు: రూ. 26లక్షల పరిహారం

Published Thu, Sep 7 2017 1:43 PM | Last Updated on Sun, Sep 17 2017 6:32 PM

రెరా తొలి తీర్పు: రూ. 26లక్షల పరిహారం

రెరా తొలి తీర్పు: రూ. 26లక్షల పరిహారం

సాక్షి, ముంబై:  ఈ ఏడాది మే 1 నుంచి అమల్లోకి వచ్చిన రియల్ ఎస్టేట్ చట్టం రెరా (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్)  పరిధిలో   తొలి తీర్పు వెలుపడింది.  అదీ గృహకొనుగోలుదారుకు  అనుకూలంగా ఈ తీర్పు వెలుడింది. అనుకున్న సమయానికి ఇంటిని స్వాధీనం చేయకపోవడంతో  బాధితుడు ఆన్‌లైన్‌  ద్వారా రెరాకు ఫిర్యాదు చేశారు. దీంతో  ఆయనకు పరిహారం చెల్లించాల్సిందిగా  బిల్డర్‌ను రెరా ఆదేశించింది.

2016నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని బిల్డర్‌ చెప్పారు. కానీ వాస్తవానికి అలా జరగలేదు. దీనికి తోడు ఆయన చెల్లించిన అడ్వాన్స్‌  సొమ్మను చెల్లించడానికి సదరు బిల్డర్‌ నిరాకరించారు. ఈ  క్రమంలో  బాధితుడు రెరాను ఆశ్రయించారు.  రూ.5000 చెల్లింపు ద్వారా మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (మహారెరా)  వెబ్‌సైట్‌ లో ఫిర్యాదుదారు  కేసు నమోదు చేశారు. దీన్ని విచారించిన రెరా  గృహ కొనుగోలుదారునికి రూ. 26.15 లక్షలను తిరిగి చెల్లించాలని బుధవారం  ఆదేశించింది. ముంబై‍కి చెందిన  బిల్డర్‌కు ఈ  ఆదేశాలు జారీ చేసింది.

గృహ-కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి సంబంధిత చట్టాలు అధికారుల మధ్య మంచి సమన్వయం ఉండాలని మహా రెరా  చైర్మన్ గౌతం ఛటర్జీ  మీడియాతో చెప్పారు.  ఈ సందర్భంగా జైపీ ఇన్‌ ఫ్రాటెక్‌ కేసులు ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా ప్రాజెక్ట్ డెలివరీలో జాప్యానికి సంబంధించి ఇప్పటివరకు తమకు 98 ఫిర్యాదులను అందుకున్నామన్నారు.  కారణం ఏదైనా  కొనసాగుతున్న ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లయితే వినియోగదారులే నష్టపోతారని ఛటర్జీ వ్యాఖ్యానించారు.మరోవైపు ఈ ఆదేశాలు జారీ అయినే వెంటనే డెవలపర్‌ తనుకు చెక్‌ను అందించారంటూ ఫిర్యాదు దారు సంతోషం వ్యక్తం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement