ఆగ్రా : ఆవు పేడ సబ్బులు, మోదీ, యోగి కుర్తాలు ఎవరికైనా కావాలా? అయితే అవి ఇక నుంచి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో దొరుకుతాయట. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు చెందిన ఫార్మసీ, ఆవు పేడతో తయారు చేసిన డజన్ల కొద్దీ సహజ సౌందర్య, ఔషధ ఉత్పత్తులను అమెజాన్‌లోకి తీసుకొస్తుంది. ఆవు పేడ సబ్బుతో పాటు, మోదీ, యోగికి చెందిన కుర్తాలను కూడా వినియోగదారులకు అందిస్తుంది.
దీన్ దయాల్ ధమ్ అనే సెంటర్‌ను ఆర్‌ఎస్‌ఎస్ మథురాలో నిర్వహిస్తోంది. ఇది తొలుత 30 వ్యక్తిగత సంరక్షణ ప్రొడక్ట్‌లను, థెరఫెటిక్ ఉత్పత్తులను విక్రయించనుంది. వాటితో పాటు 10 స్టయిల్స్‌లో దుస్తులను డిజైన్ చేసి ఆన్‌లైన్‌గా అందించనుంది. తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌గా అందించే ముఖ్య ఉద్దేశ్యం, స్థానికంగా ఎక్కువ ఉద్యోగులను సృష్టించడమని, వారిని ఆర్థికంగా స్వతంత్రులను చేయడమని ఆర్‌ఎస్‌ఎస్ అధికార ప్రతినిధి అరుణ్ కుమార్ చెప్పారు. ఆన్‌లైన్‌గా విక్రయాలు ప్రారంభమైతే, ఉత్పత్తి, ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. లక్షకు పైగా వ్యక్తిగత సంరక్షణ, మెడికల్ ఉత్పత్తులను, దుస్తులను దీన్ దయాల్ ధమ్ విక్రయించనుంది. వీటి విలువ ప్రతి నెల రూ.3 లక్షలకు పైననే ఉండనుంది.
తమ కామధేను లైన్‌లో ఆవు మూత్రం, కుర్తాలను, ఇతర ఖాదీ ఉత్పత్తులను త్వరలోనే అమెజాన్‌లో అందుబాటులోకి తెస్తామని దీన్ దయాల్ ధమ్ డిప్యూటీ సెక్రటరీ మనీష్ గుప్తా చెప్పారు. గన్‌వటి, తులసి, ఉసిరి, మిరియాలు, మధుమేహం, ఊబకాయం కోసం కామధేను మధునాశక్ చుర్, హారతీలు, షాంపులు, బాత్ షోపులు, ఫేస్ ప్యాక్, టూత్‌పేస్ట్ వంటి ఉత్పత్తులను అందించబోతుంది. తమ సోపులకు, ఫేస్‌ప్యాక్‌లకు ఆవు మూత్రం, ఆవు పేడ ప్రధానమైన పదార్థాలుగా వాడినట్టు మనీష్ తెలిపారు. ప్రస్తుతం 10 మంది వర్కర్లతో, 90 ఆవులు, దూడలతో ఈ ఫార్మసీ పనిచేస్తుంది. ఇప్పటి వరకు తయారు చేసిన ఉత్పత్తులను దీన్ దయాల్ ధమ్ లేదా ఆర్‌ఎస్‌ఎస్ క్యాంపుల్లోనే విక్రయించేవారు. ఇక నుంచి వీటిని అమెజాన్ ద్వారా కూడా అందించబోతున్నారు.
ఆన్‌లైన్ కస్టమర్లలో ఆవు మూత్ర ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని, ఇదే ఉత్పత్తిని పెంచుతుందని ధమ్ డైరెక్టర్ రాజేంద్ర చెప్పారు. ధమ్‌కు చెందిన అన్ని ఉత్పత్తులు 10 రూపాయల నుంచి 230 రూపాయల మధ్యలోనే అందించనున్నట్టు పేర్కొన్నారు. మోదీ, యోగి కుర్తాలు కూడా ఒక్క పీస్ రూ.220నేనని తెలిపారు. వైట్, గ్రే, పింక్ రంగుల్లో ఇవి అందుబాటులో ఉండనున్నాయి. వీటిని కూడా 50 మంది వర్కర్లే తయారు చేస్తున్నారు. వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నారు. రెండు జతల ట్రౌజర్లు కుడితే రోజుకు రూ.120 ఆర్జించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment