సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం బలహీనంగా ప్రారంభమైంది. డాలర్‌తో పోలిస్తే 71.75 వద్ద ప్రారంభమైంది, తరువాత 71.77 కు పడిపోయింది. ఇది మునుపటి ముగింపుతో పోలిస్తే 30 పైసలు క్షీణత. సోమవారం 71.47 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. డాలర్ ఇండెక్స్ 0.03 శాతం పెరిగి 98.33 స్థాయికి చేరింది. ముడి చమురు బెంచ్ మార్క్ బ్రెంట్ ఫ్యూచర్స్ బ్యారెల్ 0.23 శాతం తగ్గి 61.92 డాలర్లకు చేరుకుంది.
అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం, హాంకాంగ్‌లో రాజకీయ అశాంతి, పెరుగుతున్న ఆందోళనలు ఒకవైపు, ఆర్థిక వ్యవస్థలో మందగమన సంకేతాలను చూపిస్తూ, ఐఐపీ డేటా క్షీణత మరోవైపు ప్రభావితం చేస్తున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి సెప్టెంబరులో 4.3 శాతం తగ్గింది, తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాలలో ఉత్పత్తి క్షీణత కారణంగా ఏడు సంవత్సరాలలో బలహీనమైన పనితీరును నమోదు చేసాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లు కూడా ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అనంతరం స్వల్పంగా పుంజుకున్నప్పటికీ ఊగిసలాట ధోరణి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment