depreciation
-
విదేశీ విద్యానిధికి డాలర్ రూట్.. ఉన్నత విద్య కోసం భారీ వ్యయం
హైదరాబాద్‌కు చెందిన వర్ధన్‌కు ఇద్దరు పిల్లలు సంతానం. ఒకరు పదో తరగతి చదువుతుంటే, మరొకరు ఐదో తరగతిలో ఉన్నారు. వీరిద్దరినీ అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం విదేశాలకు పంపాలన్నది అతడి లక్ష్యం. వర్ధన్ కేవలం ఆకాంక్షతోనే సరిపెట్టలేదు. తమ పిల్లలు మూడేళ్ల వయసులో ఉన్నప్పటి నుంచే ఆయన వారి భవిష్యత్ విద్య కోసం పెట్టుబడులు ప్రారంభించారు. అది కూడా డాలర్‌తో కోల్పోతున్న రూపాయి విలువ క్షీణతను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించారు. తన పెట్టుబడులను డాలర్ మారకంలో ఉండేలా చూసుకున్నారు. మరో రెండేళ్ల తర్వాత తన కుమారుడు గ్రాడ్యుయేషన్ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉంది. వర్ధన్ ముందస్తు ప్రణాళిక వల్ల నిశి్చంతగా ఉన్నాడు. విదేశాల్లో కోర్సుల కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే పిల్లలు స్కూల్ ఆరంభంలో ఉన్నప్పటి నుంచే పెట్టుబడుల ప్రణాళికలు అమలు చేయాలి. ఈ విషయంలో వర్ధన్ అనుసరించిన మార్గం ఎంతో మందికి ఆదర్శం అవుతుంది. పిల్లలకు అత్యుత్తమ విదేశీ విద్యావకాశాలు ఇవ్వాలని కోరుకునే తల్లిదండ్రులు, అందుకు కావాల్సిన వనరులను సమకూర్చుకునే మార్గాలను చర్చించేదే ఈ కథనం. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతూ వెళుతోంది. భారత విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం 2021 జనవరి నాటికి 85 దేశాల్లో సుమారు 11 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది కెనడాలో చదువుతున్నారు. ఆ తర్వాత అమెరికా, యూఏఈ, ఆ్రస్టేలియా, యూకే భారత విద్యార్థుల ముఖ్య ఎంపికలుగా ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏటేటా క్షీణిస్తూనే ఉండడాన్ని చూస్తున్నాం. గడిచిన 20 ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే డాలర్‌తో రూపాయి ఏటా సగటున 3 శాతం విలువను నష్టపోతూ వచ్చింది. 2009లో డాలర్‌తో రూపాయి విలువ 46.5గా ఉంటే, ఇప్పుడు 83కు చేరింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే పిల్లల చదువు కోసం చెల్లించాల్సిన ఫీజులు, ఇతర ఖర్చులన్నీ కూడా డాలర్ రూపంలో ఉంటుంటే.. మనం సంపాదించేది రూపాయిల్లో. అందుకుని పిల్లల విద్య కోసం పెట్టుబడులను డాలర్ మారకంలో చేసుకోవడమే మెరుగైన మార్గం అవుతుంది. మొత్తంగా కాకపోయినా, పెట్టుబడుల్లో చెప్పుకోతగ్గ మేర డాలర్ మారకంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒకవైపు డాలర్‌తో రూపాయి మారకం క్షీణిస్తూ పోతుంటే, మరోవైపు ద్రవ్యోల్బణం సైతం కరెన్సీ విలువను కొంత హరిస్తుంటుంది. వీటిని తట్టుకుని పెట్టుబడులపై మెరుగైన రాబడులు వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే లక్ష్యం తేలికవుతుంది. ఏమిటి మార్గం..? విదేశీ విద్య కోసం డాలర్ మారకంలో పెట్టుబడులు మేలైన మార్గం అన్నది నిపుణుల సూచన. కానీ, ఒక ఇన్వెస్టర్‌గా తాను చేసే పెట్టుబడులను అర్థం చేసుకుని, వాటి పనితీరును ట్రాక్ చేసుకునే విషయ పరిజ్ఞానం తప్పనిసరి. ఎందుకంటే అంతర్జాతీయ పెట్టుబడులపై ఎన్నో అంశాల ప్రభావం ఉంటుంది. దేశీయ అంశాలతో సంబంధం ఉండదు. అందుకని వాటిని విడిగా ట్రాక్ చేసుకోవాల్సిందే. ‘‘అంతర్జాతీయ పెట్టుబడులను ఎంపిక చేసుకునే ముందు చార్జీలను తప్పకుండా చూడాలి. సరైన స్టాక్‌ను సరైన ధరల వద్ద కొనుగోలు చేసే నైపుణ్యాలు కూడా అవసరం’’ అని మహేశ్వరి తెలిపారు. తమ మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతం మేర విదేశీ స్టాక్స్ కోసం వైవిధ్యం కోణంలో కేటాయించుకోవచ్చు. పిల్లల విదేశీ విద్యకు ఎంత ఖర్చు అవుతుందో, ఆ అంచనాల మేరకు కేటాయింపులు చేసుకోవాలి. స్టాక్స్ ఎంపిక తెలియని వారు, ఈ రిస్క్ తీసుకోకుండా విదేశీ స్టాక్స్‌తో కూడిన మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్ ఏడాది కాలంలో 17 శాతం వరకు రాబడులు ఇచ్చింది. డీఎస్పీ యూఎస్ ఫ్లెక్సిబుల్ ఈక్విటీ ఫండ్ 15 శాతం రాబడులు తెచ్చి పెట్టింది. ఇలాంటి ఎన్నో ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. డాలర్ మారకంలో పెట్టుబడులకు అవసరమైతే ఆరి్థక సలహాదారులను సంప్రదించడానికి వెనుకాడొద్దు. యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ దారి నేరుగా స్టాక్స్ ► దేశీయ బ్రోకరేజీ, విదేశీ బ్రోకరేజీ సంస్థ లేదా ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ► దేశీయ బ్రోకరేజీ సంస్థలు విదేశీ బ్రోకరేజీ సంస్థలతో జట్టు కట్టి సేవలందిస్తున్నాయి. ► ఎన్ఎస్ఈ, ఐఎఫ్ఎస్సీ ద్వారా కొన్ని విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులకు అవకాశం ఉంది. ఈటీఎఫ్‌లు ► ఆర్బీఐ పరిమితుల వల్ల కొన్ని ఈటీఎఫ్‌లు మినహా.. మిగిలిన ఈటీఎఫ్‌లు అందుబాటులో ఉన్నాయి. ► కింగ్ ఎర్రర్, పెట్టుబడుల విధానంపై అవగాహన కలిగి ఉండాలి. ► ఈ పెట్టుబడులు ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కిందకు వస్తాయి. ఏడాదిలో 2,50,000 డాలర్లు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రూపాయి విలువ క్షీణత.. గడిచిన కొన్ని దశాబ్దాల కాలంలో డాలర్‌తో రూపాయి ఎంతో నష్టపోయింది. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలోనే 50 శాతం విలువను కోల్పోయింది. ఈ క్షీణత ఇక ముందూ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘‘యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కఠిన వైఖరి తీసుకోవడంతో రూపాయి క్షీణతను ఇక ముందూ చూడనున్నాం. ఎందుకంటే యూఎస్ ఫెడ్ వైఖరితో డాలర్ సరఫరా తగ్గుతుంది. అది వర్ధమాన మార్కెట్లలోకి పెట్టుబడుల రాకపై ప్రభావం చూపిస్తుంది’’అని జేఎం ఫైనాన్షియల్ చీఫ్ ఎకనమిస్ట్ ధనుంజయ్ సిన్హా వివరించారు. రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ సైతం ఫారెక్స్ నిల్వలను ఉపయోగించుకుంటోంది. డాలర్ ఇదే మాదిరిగా గరిష్ట స్థాయిలో కొనసాగితే, అధిక ముడి చమురు ధరల కారణంగా భారత్‌తో వాణిజ్య లోటు ఎగువనే ఉంటుందన్నది నిపుణుల విశ్లేషణగా ఉంది. ఇది రూపాయి విలువను మరింత కిందకు తోసేస్తుందన్న విశ్లేషణ వినిపిస్తోంది. ‘‘స్వల్ప కాలంలో డాలర్‌తో రూపాయి విలువ 6–7 శాతం మేర క్షీణించొచ్చని భావిస్తున్నాం’’ అని ధనుంజయ్ సిన్హా చెప్పారు. 1947లో స్వాంతంత్య్రం సిద్ధించే నాటికి మన రూపాయి విలువ డాలర్ మారకంలో 4గా ఉంటే, ఇప్పుడు 83 స్థాయిలకు చేరుకోవడం గమనించొచ్చు. ఫీజులపై రూపాయి ప్రభావం ‘విదేశాల్లో చదువుకు, ముఖ్యంగా అమెరికాలో.. ఎంతలేదన్నా అండర్ గ్రాడ్యుయేషన్‌కు 10 వేల నుంచి 50 వేల డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. పీజీ చేసేందుకు 12,000 డాలర్ల నుంచి 80,000 డాలర్ల వరకు (స్కాలర్షిప్ కలపకుండా) వ్యయం చేయాల్సి వస్తుంది. వీటికి తోడు నివసించే ప్రాంతం ఆధారంగా జీవన వ్యయాలకు అదనంగా ఖర్చు చేయాలి. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని విదేశాల్లోని విద్యా సంస్థలు ఇప్పటి వరకు ట్యూషన్ ఫీజుల పెంపులకు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు ఖర్చులు భారీగా పెరిగాయంటే అది కేవలం కరెన్సీ కారణంగానే’ అని విదేశీ! విద్యా కన్సల్టెన్సీ సంస్థ ఏపీఎస్ వరల్డ్ సీఈవో అనిర్బన్ సిర్కార్ తెలిపారు. ఏటా రూపాయి విలువ క్షీణిస్తుందని భావిస్తే.. దీనికి అనుగుణంగా విదేశీ కోర్సుల వ్యయం పెరుగుతూ వెళుతుంది. ‘‘విదేశీ విద్యా వ్యయం ఏటా పెరుగుతూనే ఉంది. దీనికి ద్రవ్యోల్బణం ఒక్కటే కారణం కాదు. డాలర్‌తో రూపాయి విలువ క్షీణిస్తుండడం కూడా కారణమే’’ అని యూఎస్‌లో పెట్టుబడులకు వీలు కలి్పంచే వేదిక వెస్టెడ్ ఫైనాన్స్ సీఈవో విరమ్షా చెప్పారు. 2012 జూలైలో రూపాయి విలువ డాలర్‌తో 55గా ఉంది. అప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ట్యూషన్ ఫీజు ఏడాదికి 20,000 డాలర్లు ఉందని అనుకుందాం. నాడు డాలర్‌తో రూపాయి విలువ 55 ప్రకారం ఒక ఏడాదికి రూ.11 లక్షలు ఫీజు కోసం చెల్లించాల్సి వచ్చేది. అదే ఫీజు ఇప్పుటికీ పెరగకుండా అక్కడే ఉన్నా కానీ, రూపాయి విలువ క్షీణత ఫలితంగా కోర్సు వ్యయం రూ.16.60 లక్షలకు పెరిగినట్టు అవుతుంది. అంటే రూ.5 లక్షలకు పైగా పెరిగింది. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కూడా కలిపిచూస్తే ఈ భారం ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. అందుకని పిల్లల విదేశీ విద్య కోసం పొదుపు చేసే వారు కేవలం ద్రవ్యోల్బణం ఒక్కటే కాకుండా, రూపాయి క్షీణతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంతర్జాతీయ పెట్టుబడుల మార్గం విదేశీ విద్య కోసం చేసే పెట్టుబడులను అంతర్జాతీయ మార్కెట్లకు కేటాయించుకోవడం అర్థవంతంగా ఉంటుంది. జపాన్, బ్రిటన్, యూఎస్ తదితర దేశాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడులకు వైవిధ్యం కూడా తోడవుతుంది. భారత ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది అమెరికన్ మార్కెట్లలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికైతే డాలర్ ఆధిపత్యానికి ఎలాంటి ఇబ్బంది లేదన్న విశ్లేషణ వినిపిస్తోంది. యూఎస్ పెట్టుబడులు కరెన్సీ విలువ పతనానికి హెడ్జింగ్గానే కాకుండా పెట్టుబడుల్లో వైవిధ్యానికీ వీలు కలి్పస్తాయన్నది నిపుణుల సూచన. ‘‘విదేశీ విద్య కోసం, డాలర్ మారకంలో లక్ష్యాల కోసం యూఎస్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టుకోవడం మంచి విధానం అవుతుంది. దీనివల్ల గమ్యస్థానంలో (చదువుకునే) ద్రవ్యోల్బణానికి తోడు, రూపాయి విలువ క్షీణతకు హెడ్జింగ్‌గా పనిచేస్తుంది. చాలా దేశాల్లో రిటైల్ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఉన్నత విద్య ద్రవ్యోల్బణం ఎక్కువే ఉంటుంది’’ అని ఫింజ్ స్కాలర్జ్ వెల్త్ మేనేజర్ సీఈవో రేణు మహేశ్వరి సూచించారు. డాలర్‌తో ఇన్వెస్ట్ చేసినప్పుడు, తిరిగి డాలర్‌తో ఉపసంహరించుకునేట్టుగా ఉంటే, అది అధిక ప్రయోజనాన్నిస్తుంది. ఉదాహరణకు 2012లో నిఫ్టీ 500 ఈటీఎఫ్‌లో, ఎస్అండ్పీ 500లో 100 డాలర్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. నాడు డాలర్‌తో రూపాయి విలువ 55గా ఉంది. అప్పటి నుంచి ఈ రెండు సూచీలు ఏటా 13 శాతం రాబడులు ఇచ్చాయి. దీంతో నిఫ్టీ 500 ఈటీఎఫ్‌లో 100 డాలర్ల పెట్టుబడి నేడు రూ.18,000 అవుతుంది. ఎస్అండ్పీ 500 ఈటీఎఫ్‌లో పెట్టుబడి రూ.25,000 అయి ఉండేది. 40 శాతం అధికంగా ఎస్అండ్పీ 500 ఈటీఎఫ్‌లో రాబడులు వచ్చాయి. రెండు సూచీలు ఒకే విధమైన రాబడిని ఇచి్చనా.. రెండు దేశాల కరెన్సీ విలువల్లో మార్పుల ఫలితంగా ఎస్అండ్పీ 500లో అధిక రాబడులు వచ్చాయి. డాలర్‌తో రూపాయి క్షీణించడం వల్లే ఇలా జరిగింది. -
ఈక్విటీ ఫండ్స్‌లోకి తగ్గిన పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక ఈ ఏడాది నవంబర్ మాసంలో గణనీయంగా తగ్గిపోయింది. నికరంగా రూ.933 కోట్లు మాత్రమే ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చినట్టు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ ‘యాంఫి’ తెలియజేసింది. నెలవారీగా చూసుకుంటే ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక 85 శాతం మేర తగ్గిపోయింది. 2016 జూన్ తర్వాత ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు ఈ స్థాయిలో తగ్గిపోవడం ఇదే తొలిసారి. అంతేకాదు, ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం వరుసగా మూడో నెలలోనూ తగ్గినట్టయింది. ఏవో కొన్ని ఎంపిక చేసిన స్టాక్స్ మినహా మిగిలిన స్టాక్స్ పనితీరు గత ఏడాది కాలంలో ఆశాజనకంగా లేకపోవడం ఫండ్స్ రాబడులపై ప్రభావం చూపించింది. ఇది పెట్టుబడులపైనా ప్రతిఫలించింది. మరోవైపు క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నుంచి పెట్టుబడులు గణనీయంగా బయటకు వెళ్లిపోతున్నాయి. గత నెల చివరి నాటికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు రూ.27.04 లక్షల కోట్లకు పెరిగాయి. అక్టోబర్ చివరికి ఉన్న రూ.26.33 లక్షల కోట్లతో పోల్చుకుంటే 3 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం మీద ఫండ్స్ పథకాల్లోకి అక్టోబర్‌లో రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే, అది నవంబర్‌లో రూ.54,419 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా డెట్ ఫండ్స్‌లోకి రూ.51,000 కోట్ల పెట్టుబడులు రావడం వృద్ధికి దోహదపడింది. ‘క్రెడిట్ రిస్క్’ సంక్షోభం! దేశీయ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మొత్తం 44 సంస్థలు (ఏఎంసీలు) కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, వీటి పరిధిలోని క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నుంచి నవంబర్‌లో నికరంగా రూ.1,899 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసేసుకున్నారు. అంతక్రితం మాసం నాటి గణాంకాలతో పోలిస్తే పెట్టుబడుల ఉపసంహరణ 37.4 శాతం పెరిగింది. గతేడాది జూలై నుంచి క్రెడిట్ రిస్క్ ఫండ్స్‌కు అమ్మకాల ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం, ఆ తర్వాత డీహెచ్ఎఫ్ఎల్ తదితర సంస్థలు రుణ పత్రాలపై చెల్లింపుల్లో విఫలం కావడం, వీటిల్లో ఇన్వెస్ట్ చేసిన క్రెడిట్ రిస్క్ ఫండ్స్ రాబడులు దెబ్బతినడం ఈ పరిణామాలకు కారణంగా కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నాటికి క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నిర్వహణలో రూ.79,643 కోట్ల పెట్టుబడులు ఉండగా, నవంబర్ చివరికి అవి రూ.63,754 కోట్లకు తగ్గాయి. ఇది 20% క్షీణత. లిక్విడ్ ఫండ్స్‌కూ నిరాదరణ... డెట్ విభాగంలో లిక్విడ్ ఫండ్స్‌కూ నిరాదరణ ఎదురైంది. అక్టోబర్‌లో లిక్విడ్ ఫండ్స్ విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు రూ.93,203 కోట్లుగా ఉంటే, నవంబర్‌లో రూ.6,938 కోట్లకు తగ్గిపోయాయి. ఎగ్జిట్ లోడ్ విధించడం వల్ల కొందరు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఓవర్‌నైట్ ఫండ్స్‌కు మళ్లించి ఉంటారని యాంఫి సీఈవో వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. ఇతర ఫండ్స్‌లోకి... ► ఈక్విటీ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) పథకాల్లోకి నవంబర్‌లో నికరంగా రూ.2,954 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం అక్టోబర్‌లో వచ్చిన పెట్టుబడులు రూ.5,906 కోట్లతో పోలిస్తే సగం మేర తగ్గాయి. ► ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకాల్లోకి రూ.1,312 కోట్ల పెట్టుబడులు రాగా, రూ.379 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లాయి. దీంతో నికర పెట్టుబడులు రూ.933 కోట్లుగా నమోదయ్యాయి. ► డెట్ విభాగంలో ఓవర్‌నైట్ ఫండ్స్ (ఒక్క రోజు కాల వ్యవధి సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసేవి)లోకి రూ.20,650 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లిక్విడ్ ఫండ్స్‌కు ఎగ్జిట్ లోడ్ విధించడం వీటికి కలిసొచ్చింది. ► బ్యాంకింగ్–పీఎస్‌యూ ఫండ్స్‌లోకి 7,230 కోట్లు వచ్చాయి. ► గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి నికరంగా రూ.7 కోట్లు వచ్చాయి. అంతక్రితం నెలలో రూ.31.45 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. లాభాల స్వీకరణే.. ఈక్విటీ పథకాల్లో నికర పెట్టుబడుల రాక గణనీయంగా తగ్గడానికి ఒకింత ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణే కారణం. అయితే, మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణ ఆస్తులు మాత్రం మొత్తం మీద రూ.27 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి దీర్ఘకాల లక్ష్యాల కోసం ఉద్దేశించిన సిప్ పెట్టుబడులు క్రమంగా వృద్ధి చెందుతూ నూతన గరిష్ట స్థాయి రూ.3.12 లక్షల కోట్లకు చేరాయి. – ఎన్ఎస్ వెంకటేశ్, యాంఫి సీఈవో -
30 పైసల నష్టంతో రూపాయి
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం బలహీనంగా ప్రారంభమైంది. డాలర్‌తో పోలిస్తే 71.75 వద్ద ప్రారంభమైంది, తరువాత 71.77 కు పడిపోయింది. ఇది మునుపటి ముగింపుతో పోలిస్తే 30 పైసలు క్షీణత. సోమవారం 71.47 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. డాలర్ ఇండెక్స్ 0.03 శాతం పెరిగి 98.33 స్థాయికి చేరింది. ముడి చమురు బెంచ్ మార్క్ బ్రెంట్ ఫ్యూచర్స్ బ్యారెల్ 0.23 శాతం తగ్గి 61.92 డాలర్లకు చేరుకుంది. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం, హాంకాంగ్‌లో రాజకీయ అశాంతి, పెరుగుతున్న ఆందోళనలు ఒకవైపు, ఆర్థిక వ్యవస్థలో మందగమన సంకేతాలను చూపిస్తూ, ఐఐపీ డేటా క్షీణత మరోవైపు ప్రభావితం చేస్తున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి సెప్టెంబరులో 4.3 శాతం తగ్గింది, తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాలలో ఉత్పత్తి క్షీణత కారణంగా ఏడు సంవత్సరాలలో బలహీనమైన పనితీరును నమోదు చేసాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లు కూడా ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అనంతరం స్వల్పంగా పుంజుకున్నప్పటికీ ఊగిసలాట ధోరణి నెలకొంది. -
ఎగుమతులు రివర్స్‌గేర్
న్యూఢిల్లీ: భారత్ ఆరి్థక వ్యవస్థ మందగమనానికి ఆగస్టు ఎగుమతి–దిగుమతులు అద్దం పడుతున్నాయి. ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా 6 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక దిగుమతులదీ అదే ధోరణి. 13.45 శాతం క్షీణత నమోదయ్యింది. ఈ ఏడాది జూలైలో ఎగుమతులు స్వల్పంగా 2.25 శాతం వృద్ధి చెందాయి. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాశాలను చూస్తే... ► ఆగస్టులో ఎగుమతుల విలువ 26.13 బిలియన్ డాలర్లు. 2018 ఆగస్టుతో పోలి్చతే విలువ పెరక్కపోగా 6 శాతం క్షీణించింది. పెట్రోలియం, ఇంజనీరింగ్, తోలు, రత్నాలు, ఆభరణాల విభాగంలో అసలు వృద్ధిలేదు. ఎగుమతులకు సంబంధించి మొత్తం 30 కీలక రంగాలను చూస్తే, 22 ప్రతికూలతనే నమోదుచేసుకున్నాయి. రత్నాలు ఆభరణాల విభాగంలో –3.5% క్షీణత, ఇంజనీరింగ్ గూడ్స్ విషయంలో 9.35% క్షీణత, పెట్రోలియం ప్రొడక్టుల విషయంలో 10.73% క్షీణత నమోదయ్యింది. కాగా సానుకూలత నమోదు చేసిన రంగాల్లో ముడి ఇనుము, ఎలక్ట్రానిక్ గూడ్స్, సుగంధ ద్రవ్యాలు, మెరైన్ ప్రొడక్టులు ఉన్నాయి. ► దిగుమతుల విలువలో కూడా (2018 ఆగస్టుతో పోలి్చతే) అసలు పెరుగుదల లేకపోగా 13.45 శాతం క్షీణత నమోదయ్యింది. విలువ 39.58 బిలియన్లుగా నమోదయ్యింది. దిగుమతుల్లో ఇంత స్థాయి క్షీణత 2016 ఆగస్టు తర్వాత ఇదే తొలిసారి. అప్పట్లో ఈ క్షీణ రేటు మైసస్ 14 శాతంగా ఉంది. ► దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 13.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2018 ఆగస్టులో వాణిజ్యలోటు 17.92 బిలియన్ డాలర్లు. ► ఆగస్టులో చమురు దిగుమతులు 8.9 శాతం పడిపోయి 10.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురు యేతర దిగుమతులు కూడా 15 శాతం క్షీణించి, 28.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇక ప్రత్యేకించి పసిడి దిగుమతులు చూస్తే, భారీగా 62.49 శాతం పడిపోయి 1.36 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఏడాదంతా నిరుత్సాహమే... భారత్ ఎగుమతుల విభాగం ఈ ఏడాది ఇప్పటి వరకూ నిరుత్సాహంగానే నిలిచింది. ఆరి్థక వ్యవస్థ మందగమనం ఇక్కడ ప్రతిబింబిస్తోంది. ఆరి్థక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి ఆరేళ్ల కనిష్టస్థాయి 5 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. తయారీ రంగం మందగమనంతో జూలైలో తయారీ రంగం వృద్ధి కూడా 4.3 శాతానికి పరిమితం అయ్యింది. కాగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ చూసుకుంటే, భారత్ ఎగుమతులు 1.53 శాతం క్షీణించి, 133.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులు కూడా 5.68 శాతం పడిపోయి 206.39 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు 72.85 బిలియన్ డాలర్లుగా ఉంది. -
దళిత యువశక్తి @ 2019
భారత జనాభాలో అయిదోవంతు ఉన్న దళితులు వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారనున్నారు. కొత్త తరం దళితుల సంఖ్య ఈసారి గణనీయంగా పెరగడంతో ఎన్నికల్లో వారే కీలక ఓటు బ్యాంకు కానున్నారు. 2.3 కోట్ల మంది యువ దళిత ఓటర్లు తొలిసారిగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. దేశం మొత్తమ్మీద ఉన్న దళిత జనాభాలో వీరే 19 శాతం ఉన్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే వారి సంఖ్య అత్యధికంగా ఉంది. 1991–2011 మధ్య కాలంలో భారత జనాభా పెరుగుదల రేటు కంటే దళిత జనాభా పెరుగుదల రేటు చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఈ సారి యువ దళిత ఓటర్ల సంఖ్య పెరిగింది. అలాగే ఈ కొత్త తరం ఓటర్లలో 90 శాతం మంది చదువుకున్నవారే. తత్ఫలితంగా దళితులు సామాజికంగా ఎంత అణచివేతకు గురవుతున్నారు? ఏయే రంగాల్లో తమ వర్గం పరిస్థితి ఎలా ఉందన్న అవగాహన వారిలో బాగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుతం 27,518 ఉద్యోగాలు ఖాళీగా ఉండగా వాటిలో మూడో వంతు దళితులకు రిజర్వ్ చేసినవే. కానీ ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి 2012 సంవత్సరం నుంచి ఒక్క ప్రయత్నం కూడా జరగలేదు. అలాగే దళిత వర్గానికి చెందిన వారు వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారుల కంటే బాగా కింది స్థాయి ఉద్యోగాల్లోనే ఎక్కువగా పనిచేస్తుండటంతో యువ దళితులు అసహనంతో ఉన్నారు. అన్యాయాలపై గళమెత్తి ప్రశ్నించే వారి సంఖ్య కూడా పెరిగింది. బుజ్జగించే వ్యూహంలో బీజేపీ దళితుల్ని ఆకట్టుకోవడం కోసం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 127వ జయంతి సందర్భంగా బీజేపీ పలు వ్యూహాలను రచిస్తోంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై పెరిగిపోతున్న దాడులు, అంబేడ్కర్ విగ్రహాల కూల్చివేతలు, వాటికి కాషాయ రంగులు పూయడం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు తాజా తీర్పు వంటి పరిణామాలతో దేశంలో దళితులు అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు మోదీ దళిత వ్యతిరేకి అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి బీజేపీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే అంబేడ్కర్ స్మారకం ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ యువ దళిత ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అమ్మ కావడమే నేరమా?
చేయని నేరం పిల్లల కోసం తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది తల్లి. కానీ ఏంజెలా కానింగ్స విషయంలో ఆ మాట నిజం కాదు అంది న్యాయస్థానం. ఆమెకు తల్లి అనిపించుకునే అర్హతే లేదంటూ కటకటాల వెనుక్కు పంపించింది. యూకేకి చెందిన ఏంజెలా తన ఫ్రెండ్ టెర్రీని పెళ్లి చేసుకుంది. సంవత్సరం తిరిగే లోపు ఓ పాపకు తల్లి అయ్యింది. కానీ పదమూడు నెలల వయసులో ఆ పాప హఠాత్తుగా అనారోగ్యంతో మరణించింది. విలవిల్లాడిపోయింది ఏంజెలా. తర్వాత కొన్నాళ్లకు మళ్లీ అమ్మయ్యింది. గుమ్మడి పండులాంటి మగబిడ్డను చూసుకుని మురిసిపోయింది. కానీ పద్దెనిమిది నెలల వయసులో ఆ బాబు కూడా కన్ను మూశాడు. తట్టుకోలేకపోయింది ఏంజెలా. గుండె పగిలేలా ఏడ్చింది. అయితే సమాజం ఆమె మీద జాలి చూపించలేదు. వరుసగా పిల్లలు చనిపోవడాన్ని అనుమా నించింది. ఏంజెలాయే వాళ్లని ఏదో చేస్తోందని కొందరన్నారు. పోలీసులకు ఉప్పు అందడంతో ఏంజెలాని అరెస్ట్ చేశారు. తనకే పాపం తెలియదని ఎంత మొత్తుకున్నా కోర్టు నమ్మలేదు. ఆమెను దోషిగా ఎంచి జైలుకు పంపించింది. సుదీర్ఘ విచారణల అనంతరం 2002లో తీర్పు వెలువడే సమయానికి ఆమె మరో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారిని వదల్లేక వదల్లేక వదిలి జైలుకు వెళ్లింది ఏంజెలా. ప్రపంచమంతా ఏంజెలాను అనుమా నించినా, భర్త మాత్రం అనుమానించ లేదు. పిల్లలంటే ఆమెకెంత పిచ్చో అతనికి తెలుసు. అందుకే పిల్లల మరణానికి కారణాన్ని అన్వేషించాడు. వంశ పారం పర్యంగా వచ్చే ఓ వ్యాధి కారణంగా వాళ్లు మరణించారని తేలింది. ఆ విషయాన్ని కోర్టులో నిరూపించాడు. భార్యను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చాడు. కానీ అప్పటికే ఏంజెలా 49 నెలల జైలు జీవితాన్ని గడిపింది. ఆ బాధతో డిప్రెషన్‌కి గురై ఇప్పటికీ చికిత్స తీసుకుంటోంది! -
వేదాంతాకు కెయిర్న్ ఇండియా భారీ రుణం
న్యూఢిల్లీ: మాతృ సంస్థ వేదాంతా గ్రూప్‌నకు 1.25 బిలియన్ డాలర్లను(రూ. 7,500 కోట్లు) కెయిర్న్ ఇండియా రుణంగా మంజూరు చేసింది. దీనిలో 80 కోట్ల డాలర్లను ఇప్పటికే విడుదల చేసింది. గతంలో సైతం తమదగ్గరున్న నగదు నిల్వలను మాతృ సంస్థ వాటా పెంచుకునేందుకు వినియోగించిన నేపథ్యంలో తాజా చర్య విమర్శలకు తెరలేపింది. దీంతో స్టాక్ మార్కెట్లో కెయిర్న్ ఇండియా షేరు గత ఐదేళ్లలోలేని విధంగా 7% పతనమైంది. బీఎస్ఈలో రూ. 323 వద్ద ముగిసింది. కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వల వినియోగంపై పలువురు విశ్లేషకులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కంపెనీ ప్రతినిధి వివరణ ఇస్తూ 3%పైగా ఫ్లోటింగ్ రేటుకి రుణాన్ని రెండేళ్లకు పొడిగించిన ట్లు చెప్పారు. ఇది ఫిక్స్డ్ డిపాజిట్కంటే అధికమని పేర్కొన్నారు. అయితే రుణ విషయంపై బోర్డు ఎప్పుడు నిర్ణయం తీసుకుందన్న అంశంతోపాటు, ఇందుకు వాటాదారుల అనుమతిని తీసుకోవలసి ఉన్నదా అన్న సందేహంపై స్పందించేందుకు కంపెనీ నిరాకరించింది. కెయిర్న్ ఇండియాలో వేదాంతాకు 59.90% వాటా ఉంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్లో కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్‌గా 64% క్షీణించడం కూడా షేరు పతనానికి కారణమని నిపుణులు చెప్పారు. అనుమతి తీసుకోవాలి: ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వచ్చిన కంపెనీల కొత్త చట్టం ప్రకారం ఇలాంటి లావాదేవీలకు వాటాదారుల అనుమతి తీసుకోవలసి ఉంది. కెయిర్న్ ఇండియా బుధవారం వాటాదారుల సమావేశాన్ని నిర్వహించినప్పటికీ ఎలాంటి వివరణా ఇవ్వలేదు. మిగులు నిధుల వినియోగంలో కంపెనీలు చేపట్టే ఇలాంటి లావాదేవీలు సందేహాలకు తావిస్తాయని గోల్డ్‌మన్ శాక్స్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ వ్యాఖ్యానించింది. కాగా, జూన్ చివరికి తమవద్ద దాదాపు 3 బిలియన్ డాలర్ల(సుమారు రూ.18 వేల కోట్లు)నగదు నిల్వలున్నట్లు కెయిర్న్ ఇండియా బుధవారం తెలిపింది. -
కంపెనీల ఆదాయంలో 11-12% వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీల ఆదాయాలు స్థిరంగా 7-9% ఉంటాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రీసెర్చ్ పేర్కొంది. కాని గత రెండు త్రైమాసికాలతో పోలిస్తే ఆదాయాల క్షీణత ఆగి స్వల్ప వృద్ధి కనిపిస్తోందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11-12 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. ఎన్నికల తర్వాత స్థిరమైన ప్రభుత్వం వస్తుందన్న అంచనాతో ఆదాయం, నిర్వహణ లాభాల్లో క్షీణత ఆగి, వృద్ధి నమోదవుతోందని క్రిసిల్ ప్రెసిడెంట్ ముఖేష్ అగర్వాల్ తెలిపారు. దీనికితోడు గత 12-18 నెలల నుంచి ఆగిపోయిన ప్రాజెక్టుల్లో కదలిక తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, అం తర్జాతీయంగా జీడీపీ, ఎగుమతుల్లో వృద్ధి కనపడటంతో ఈ ఏడాది ఆదాయాలు 12% వరకు పెరగొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కీలకమైన లోహాలు, ఇంధన, బొగ్గు ధరలు తగ్గడంతో కంపెనీల ఎబిట్టా మార్జిన్లు 1% పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూపాయి క్షీణత వల్ల ఐటీ, ఫార్మా, రెడీమేడ్ గార్మెంట్స్, కాటన్ యార్న్ రంగాల ఆదాయాలు బాగా పెరగనున్నాయి. అలాగే గత 3 త్రైమాసికాల నుంచి వృద్ధి బాటలోకి వచ్చిన టెలికం, రిటైల్, మీడియా రంగాలు ఇదే విధమైన ధోరణిని కొనసాగిస్తాయని క్రిసిల్ పేర్కొంది.