సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీరూపాయల గురువారం భారీగా పుంజుకుంది. డాలరుమారకంలో ఏకంగా 48 పైసలు ఎగిసింది. పెట్టుబడిదారుల కొనుగోళ్ల ఆసక్తితో గత నష్టాలనుంచి కోలుకుని 71.21 వద్ద ముగిసింది. బుధారం డాలర్‌తో పోలిస్తే రూపాయ 72 స్థాయికి పతనమై, చివరికి 71.70 వద్ద ముగిసింది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తత తగ్గుముఖం పట్టనుందన్న అంచనాలతో డాలర్ ఇండెక్స్ 0.12 శాతం పెరిగి 97.41 వద్దకు చేరుకుంది. అలాగే ముడిచమురు ధరలలో భారీ పతనం రూపాయికి బలాన్ని ఇచ్చిందని ఎనలిస్టులు చెబుతున్నారు. 71.60 కీలక మద్దతు స్థాయిని అని, అయితే రాబోయే సెషన్లలో 71.45-71.25 స్థాయి కీలకమని ఎల్‌కెపి సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ (కమోడిటీ అండ్ కరెన్సీ) జతీన్ త్రివేది అన్నారు. కాగా అమెరికా ఇరాన్ ఇద్దరూ ఒకరితో ఒకరు యుద్ధానికి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు వెల్లడించాయి.
కాగా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలోని శాంతి వచనాలు గ్లోబల్ మార్కెటలకు ఊతమిచ్చాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా భారీ లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 635 లాభపడగా, నిఫ్టీ 191 పాయింట్లు ఎగిసింది.
Comments
Please login to add a commentAdd a comment