గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్‌బీఐ) కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ప్రమోటర్లు అదనపు వాటా కొనుగోలు చేయనున్న వార్తలతో ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్‌ఇండ్ బ్యాంక్ కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌బీఐ షేరు తొలుత 6 శాతం జంప్‌చేసింది. రూ. 198 సమీపానికి చేరింది. ప్రస్తుతం 4 శాతం ఎగసి రూ. 195 వద్ద ట్రేడవుతోంది. ఇక ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేరు తొలుత 8 శాతం దూసుకెళ్లి రూ. 456ను తాకింది. ప్రస్తుతం 6.5 శాతం లాభపడి రూ. 450 వద్ద ట్రేడవుతోంది. ఇతర వివరాలు చూద్దాం..
లాభాలు అప్
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ రూ. 3581 కోట్ల నికర లాభం ఆర్జించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన ఇది రికార్డ్‌కాగా.. ఇందుకు అనుబంధ విభాగం ఎస్‌బీఐ కార్డ్స్‌లో వాటా విక్రయం ద్వారా సమకూరిన రూ. 2731 కోట అదనపు ఆదాయం సహకరించింది. నికర వడ్డీ ఆదాయం నామమాత్ర క్షీణతతో రూ. 22766 కోట్లకు పరిమితంకాగా.. స్థూల, నికర మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 6.15 శాతం, 2.23 శాతానికి చేరాయి.
ఇండస్‌ఇండ్ బ్యాంక్
ఓపెన్ మార్కెట్ ద్వారా ప్రమోటర్ గ్రూప్ అదనపు షేర్లను కొనుగోలు చేయనున్నట్లు వెలువడిన వార్తలు ఇండస్‌ఇండ్ బ్యాంక్ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకులో ప్రమోటర్లకు 14.68 శాతం వాటా ఉంది. ఈ వాటాను 26 శాతం వరకూ పెంచుకునేందుకు అనుమతించమంటూ ఏప్రిల్‌లో ప్రమోటర్లు రిజర్వ్ బ్యాంక్‌నకు దరఖాస్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment