
ఎస్‌బీఐ సమాధాన్..
appకీ కహానీ...
మీరు ఎస్‌బీఐ కస్టమరా? మీ అకౌంట్ బ్యాలెన్స్ వివరాలను, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్, రుణ వడ్డీరేట్లు సంబంధిత సేవలన్నింటినీ ఒకే చోటు తెలుసుకోవాలని భావిస్తే ‘ఎస్‌బీఐ సమాధాన్’ యాప్‌ను ఉపయోగించండి. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తన వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలన్నింటినీ ఒకే చోటు అందించాలనే లక్ష్యంతో ఎస్‌బీఐ ఈ యాప్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది.
ప్రత్యేకతలు
* చాలా సింపుల్‌గా ఉండే యూజర్ ఇంటర్‌ఫేజ్.
* యాప్‌ను ఓపెన్ చేయగానే డిపాజిట్స్, అడ్వాన్సెస్, అకౌంట్ సంబంధిత సేవలు, ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్, ట్యాక్స్ సంబంధిత సేవలు, ఈఎంఐ కాలిక్యులేటర్, హెల్ప్‌లైన్, ఫిర్యాదులు, ఇతర సేవలు అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
* వినియోగదారులు అకౌంట్ బ్యాలెన్స్ వివరాలను తెలుసుకోవాలంటే ‘అకౌంట్ సంబంధిత సేవలు’ అనే ఆప్షన్‌లోకి వెళ్లి బ్యాంక్ ఖాతా నంబర్‌ను, దానికింద పాస్‌వర్డ్ కోసం ఏదైనా నాలుగు అక్షరాలను ఎంటర్ చేయాలి. అప్పుడు మీ అకౌంట్ బ్యాలెన్స్ వివరాలు పీడీఎఫ్ ఫైల్ రూపంలో మీకు ఈ-మెయిల్ వస్తాయి.
* పీడీఎఫ్ ఫైల్‌ను ఓపెన్ చేయాలంటే మీరు ముందు పాస్‌వర్డ్ కోసం నాలుగు పదాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకు ముందుగా మీరు బ్యాంకులో మీ ఈ-మెయిల్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీ ఖాతాకు ఈ మెయిల్‌ను లింక్ చేసి ఉండకపోతే... ఈ సదుపాయాన్ని వినియోగించుకోలేరు.