టీసీఎన్‌ఎస్‌ ఐపీఓకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ | SEBI Green Signal to tcns | Sakshi
Sakshi News home page

టీసీఎన్‌ఎస్‌ ఐపీఓకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌

Published Wed, May 9 2018 12:51 AM | Last Updated on Wed, May 9 2018 12:51 AM

SEBI Green Signal to tcns - Sakshi

న్యూఢిల్లీ: మహిళల దుస్తులు తయారు చేసే టీసీఎన్‌ఎస్‌ క్లోతింగ్‌ కంపెనీ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓలో భాగంగా 1.57 కోట్ల మేర ఈక్విటీ షేర్లను ఆఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయిస్తారు. ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా కోటక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్, సిటి సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ఇష్యూ సైజు రూ.800 కోట్లుగా ఉండొచ్చని అంచనా.

ఈ కంపెనీ డబ్ల్యూ, అరెలియా, విష్‌ఫుల్‌ బ్రాండ్ల పేరుతో దుస్తులను విక్రయిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌ నాటికి ఈ కంపెనీ 418 ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ అవుట్‌లెట్లు, 1,305 లార్జ్‌ ఫార్మాట్‌ స్టోర్‌ అవుట్‌లెట్లు, 1,361 మల్టీ బ్రాండ్‌ అవుట్‌లెట్‌ల ద్వారా తన ఉత్పత్తులను అమ్ముతోంది. నేపాల్, మారిషస్, శ్రీలంకల్లో కూడా విక్రయాలు జరుపుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.723 కోట్ల ఆదాయంపై రూ.89 కోట్ల నికర లాభం సాధించింది. 2012–13 నుంచి ఈ కంపెనీ ఆదాయం 40 శాతం, నికర లాభం 80 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement