స్వల్ప లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిసింది. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 65 పాయింట్ల లాభంతో 27061 పాయింట్ల వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల వృద్ధితో 8105 వద్ద ముగిసాయి.
ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 27096 పాయింట్ల గరిష్ట స్థాయిని, 26965 పాయింట్ల కనిష్ట స్థాయి, నిఫ్టీ 8114 పాయింట్ల, నిఫ్టీ 8071 పాయింట్ల మధ్య కదలాడింది.
సిప్లా అత్యధికంగా 6.53 శాతం, లుపిన్, ఏషియన్ పెయింట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్ బీ కంపెనీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. హిండాల్కో, కెయిర్న్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, అల్ట్రా టెక్ సిమెంట్స్ కంపెనీలు నష్టాలతో ముగిసాయి.