సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైంది. ఆరంభంలో 300 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్ 247 పాయింట్ల నష్టంతో 31466 వద్ద, నిఫ్టీ 60 పాయింట్లు బలహీనపడి 9211 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంకింగ్ రంగం నష్టపోతోంది. దీంతో నిఫ్టీ బ్యాంకు19500 దిగువకు చేరింది. కరోనావైరస్ సంక్షోభం, లాక్‌డౌన్ పొడగింపు కారణంగా ఆర్ధిక మాంద్యం పరిస్థితులు మరింత స్పష్టంగా మారడంతో ఆమెరికా, ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. దీంతో మన మార్కెట్లు కూడా ప్రభావితమవుతున్నాయి.
హిందుస్తాన్ యూనిలీవర్ 5 శాతం నష్టపోగా ఓఎన్ జీసీ, బీపీసీఎల్ , కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, బ్రిటానియా, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్ప్, నెస్లే భారీగా నష్టపోతున్నాయి. ఆశ్చర్యకర ఫలితాలను ప్రకటించిన యస్ బ్యాంకు ఏకంగా 15 శాతం లాభపడింది. మరోవైపు కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడంతో మారుతితోపాటు ఇతర ఆటో రంగ షేర్లు లాభాల్లో ఉన్నాయి. దీంతోపాటు ఫార్మ రంగ షేర్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment