ఫెడ్ మీటింగ్: ఫ్లాట్ గా మార్కెట్లు
Published Wed, Jun 14 2017 9:50 AM | Last Updated on Mon, Oct 1 2018 5:32 PM
ముంబై : ఫెడరల్ రిజర్వు పాలసీ ప్రకటన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు(బుధవారం) ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 37.04 పాయింట్ల లాభంలో 31,140 వద్ద, నిఫ్టీ 1.70 పాయింట్ల నష్టంలో 9,605 వద్ద ట్రేడవుతున్నాయి. రెండు రోజుల పాటు భేటీ అయిన ఫెడరల్ రిజర్వు నేడు తమ పాలసీ మీటింగ్ వివరాలను వెల్లడించనుంది. దీంతో ఫెడ్ ప్రకటన ఎలా వస్తుందోనని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ట్రేడింగ్ ప్రారంభంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్, ఇన్ఫోసిస్, లుపిన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభాలు పండించగా.. ఏషియన్ పేయింట్స్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టాటా స్టీల్ నష్టాలు గడించాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా 64.34 వద్ద ఫ్లాట్ గా ప్రారంభమైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 41 రూపాయల నష్టంలో 28,952 వద్ద ట్రేడవుతున్నాయి.
Advertisement
Advertisement