సాక్షి,ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నెగిటివ్ ప్రభావం దేశీయ మార్కెట్లపై భారీగా పడింది. దీంతో ఆరంభ నష్టాలకు తోడు మరింత పతనమై సెన్సెక్స్ 181 పాయింట్లు క్షీణించి 31,570కు చేరింది. నిఫ్టీ 56 పాయింట్ల వెనకడుగుతో 9857వద్ద ట్రేడ్ అవుతోంది. తద్వారా 9,900 పాయింట్ల కీలక స్థాయి దిగువకు చేరింది.
ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించడంతో ఆసియాలో మార్కెట్లు ఢమాల్ అన్నాయి. దీంతో దేశీయంగా సెంటిమెంట్ బలహీనపడింది. దాదాపు అన్నిరంగాలూ న ష్టపోతున్నాయి. ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్, రియల్టీ, ఫార్మా బలహీనంగా ఉన్నాయి. ఎన్‌టీపీసీ, బీవోబీ, టాటా మోటార్స్ డీవీఆర్, ఐబీహౌసింగ్, ఏసీసీ, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా పవర్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్ నష్టపోతుండగా, ఐవోసీ, బీపీసీఎల్, లుపిన్, విప్రో, వేదాంతా లాభపడుతున్నాయి.
అటు డాలర్‌మారకంలో రూపాయి 0.13పైసలు లాభపడి వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా 108 లాభపడి రూ.29, 275 వద్ద ఉంది.