సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు పటిష్టంగా కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువన ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 383 పాయింట్లు లాభంతో 35293 స్థాయికి ఎగియగా నిఫ్టీ, 116 పాయింట్లు ఎగిసి 10427వద్ద కొనసాగుతున్నాయి. ఐటీ తప్ప మిగతా అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. (ఐటీ షేర్లకు ట్రంప్ షాక్ : రికవరీ)
అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1బీ, హెచ్ 4 తదితర వర్క్ వీసాలను 2020 డిసెంబర్ 31 వరకు తాత్కాలికంగా రద్దు చేయడంతో ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఆరంభ లాభాలను స్వల్పంగా పుంజుకున్నప్పటికీ ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్ ఈ రోజు సెన్సెక్స్ నష్టాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. ఫైనాన్షియల్, ఫార్మా స్టాక్స్ భారీగా ఎగిసాయి. పీఎన్‌బీ ఎస్‌బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఒక్కొక్కటి 4 శాతం వరకు లాభపడ్డాయి. ఫార్మా సెక్టార్ లో అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, బయోకాన్, కాడిల్లా హెల్త్‌కేర్ ఒక్కొక్కటి 1 -3 శాతం లాభాలతో ఉన్నాయి. అటు ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, బజాజ్ ఫిన్ సర్వ్ లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment