5 రోజుల నష్టాలకు చెక్ | Sensex snaps 5-day fall, recovers 41 points on value buying | Sakshi
Sakshi News home page

5 రోజుల నష్టాలకు చెక్

Published Tue, May 6 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM

5 రోజుల నష్టాలకు చెక్

5 రోజుల నష్టాలకు చెక్

 ఎట్టకేలకు ఐదు రోజుల వరుస నష్టాలకు చెక్ పడింది. రోజంతా ఒడిదుడుకులకు లోనైన మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 41 పాయింట్లు లాభపడి 22,445 వద్ద నిలవగా, నిఫ్టీ 4 పాయింట్లు పెరిగి 6,699 వద్ద స్థిరపడింది. రోజులో సెన్సెక్స్ గరిష్టంగా 22,592, కనిష్టంగా 22,354 పాయింట్లను తాకింది. గత ఐదు రోజుల్లో సెన్సెక్స్ 473 పాయింట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆయిల్, మెటల్ రంగాలు 1%పైగా పుంజుకోగా, ఐటీ 1% స్థాయిలో డీలాపడింది. ఎఫ్‌ఐఐలు రూ. 280 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీ సంస్థలు రూ. 225 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి.

 హిందాల్కో 5% అప్
 సెన్సెక్స్ దిగ్గజాలలో హిందాల్కో 5% జంప్‌చేయగా, ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్, ఐటీసీ 2-1% మధ్య లాభపడ్డాయి. అయితే హెచ్‌డీఎఫ్‌సీ, సిప్లా, టాటా పవర్, భారతీ, ఇన్ఫోసిస్, విప్రో 2.3-1.3% మధ్య నీరసించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement