
కోల్‌కత: శ్రేయీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.139 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.65 కోట్లతో పోలిస్తే 114 శాతం వృద్ధి సాధించామని శ్రేయీ ఇన్‌ఫ్రా తెలియజేసింది. రుణ పంపిణీ 35 శాతం వృద్ధితో రూ.5,941 కోట్లకు ఎగసిందని కంపెనీ సీఎమ్‌డీ హేమంత్ కనోరియా తెలిపారు.
ముందుగా అంచనా వేసినట్లుగానే వ్యాపారం మెరుగుపడిందని పేర్కొన్నారు. బ్యాంక్‌లు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు మౌలిక రంగ రుణాలు ఇవ్వడానికి వెనకాడుతున్నాయని, కానీ తాము మాత్రం ఈ రంగంపైననే దృష్టి పెడుతున్నామని వివరించారు. ఈ రంగంలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో శ్రేయీ ఇన్‌ఫ్రా ఫైనాన్స్ షేర్ 3.3 శాతం లాభంతో రూ.51.50 వద్ద ముగిసింది.