ఆదిభట్లలో శ్రీ శ్రీ గృహాలు! | sree sree home town ships in aadhibatla | Sakshi
Sakshi News home page

ఆదిభట్లలో శ్రీ శ్రీ గృహాలు!

Published Sat, Jan 14 2017 1:36 AM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM

ఆదిభట్లలో శ్రీ శ్రీ గృహాలు!

ఆదిభట్లలో శ్రీ శ్రీ గృహాలు!

6 ఎకరాల్లో ఏరో సిటీ ప్రాజెక్ట్‌
ఏరో లైట్, ఏరో పార్క్‌ వెంచర్లు కూడా..


సాక్షి, హైదరాబాద్‌: ‘‘పనిచేస్తున్న ఆఫీసుకు దగ్గర్లో ఇళ్లుండాలి. అన్ని రకాల వసతులతో అందుబాటు ధరల్లో లభించాలి’’ స్థిరాస్తి కొనుగోలుదారులెవరైనా కోరుకునేదిదే. అచ్చం ఇలాంటి ప్రాజెక్ట్‌ల నిర్మాణమే మా లక్ష్యమంటోంది శ్రీ శ్రీ గృహ నిర్మాణ్‌ ఇండియా ప్రై.లి. అందుకే టీసీఎస్, ఏరో స్పేస్, బెల్, బీడీఎల్, ఆక్టోపస్, కాగ్నిజెంట్‌ వంటి కంపెనీలతో పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆదిభట్ల ప్రాంతాన్ని ఎంచుకున్నామని సంస్థ ఎండీ కె భూపతి రాజు ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఈ ప్రాంతంలో ఏరో సిటీ ప్రాజెక్ట్‌తో పాటూ ఏరో లైట్, ఏరో పార్క్‌ వెంచర్లను కూడా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలివిగో..

టీసీఎస్, ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు మధ్యలో 6 ఎకరాల్లో శ్రీ శ్రీ ఏరో సిటీ నివాస సముదాయాన్ని నిర్మిస్తున్నాం. ఇందులో 674 ఫ్లాట్లొస్తాయి. మొత్తం 11 బ్లాకులకు గాను ప్రస్తుతం 6వ బ్లాక్‌ నిర్మాణంలో ఉంది. 1, 2, 3 బీహెచ్‌కె ఫ్లాట్లుంటాయి. 750 నుంచి 1,600 చ.అ.ల్లో ఫ్లాట్ల విస్తీర్ణాలున్నాయి. ధర చ.అ.కు రూ.3 వేలుగా నిర్ణయించాం. ఇప్పటికే 50 శాతం అమ్మకాలు పూర్తయ్యాయి కూడా. బ్యాంక్‌ రుణాలను కూడా ఇప్పిస్తున్నాం. వసతుల విషయానికొస్తే.. 2,500 చ.అ.ల్లో క్లబ్‌ హౌస్‌తో పాటూ రెస్టారెంట్, సూపర్‌ మార్కెట్, జిమ్, మినీ థియేటర్, యోగా హాల్‌ వంటివన్నీ ఉన్నాయి. 2018 మార్చి నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం.

18 ఎకరాల్లో ఏరో లైట్‌ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో 370 ఓపెన్‌ ప్లాట్లుంటాయి. విస్తీర్ణాలు 200 గజాల నుంచి 600 గజాల్లో ఉంటాయి. ఇప్పటికే 75 శాతం ప్లాట్లు అమ్ముడుపోయాయి కూడా. 42 ఎకరాల్లో ఏరో పార్క్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో మొత్తం 1,100 ప్లాట్లుంటాయి. ఇందులోనూ 200 నుంచి 600 గజాల్లో ప్లాట్లుంటాయి. ఇప్పటికే 60 శాతం అమ్మకాలు పూర్తయ్యాయి. వీటిల్లో ధరలు రూ.12–20 వేల మధ్య ఉంటాయి. ఈ వెంచర్లలో కన్‌స్ట్రక్షన్‌ కావాలంటే చేసిస్తాం కూడా.

పెద్ద నోట్ల రద్దుతో స్థిరాస్తి కొనుగోలుదారులు సందిగ్ధంలో పడ్డారు. ఇప్పుడే కొనుగోలు చేయాలా? ధరలు తగ్గుతాయా? అనే సందేహాలున్నాయి. నన్నడిగితే మాత్రం పెద్ద నోట్ల రద్దుతో ప్రతి స్థిరాస్తి లావాదేవీ పారదర్శకంగా సాగుతుంది. డెవలపర్లు పన్నులు కట్టే ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తారు కాబట్టి ధరలను పెంచే అవకాశముంది. కాబట్టి స్థిరాస్తి కొనుగోళ్లకు ఇదే సరైన సమయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement