
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. స్పల్ప లాభాలతో ప్రారంభమైన కీలక సూచీలు నష్టాల్లోకి మళ్లాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 7పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 6 పాయింట్లు నీరసించింది. పీఎస్‌యూ బ్యాంక్స్ లాభాలు మార్కెట్లకు మద‍్దతునిస్తున్నాయి. పీఎన్‌బీ, ఐసీఐసీఐ, ఐవోబీ, బ్యాంకు ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంకు, అలహాబాద్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్‌బీఐ బ్యాంకుతోపాటు కోటక్ బ్యాంకులు లాభపడుతున్నాయి. ఇంకా గెయిల్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్,సన్‌ఫార్మ, అల్ట్రా టెక్ సిమెంట్, ఓఎన్‌జీసీ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. మరోవైపు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ భారతి ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, భారతి ఇన్‌ఫ్రాటెల్ వోడాఫోన్, యస్ బ్యాంకు నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment