సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువన జోరుగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 260 పాయింట్లు ఎగిసి 35 వేల 200 పాయింట్లకు ఎగువన, నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 10350 ఎగువన కొనసాగుతున్నాయి. 59 చైనా యాప్‌లపై నిషేధం, రెండవ దశ అన్ లాక్ ప్రభుత్వ మార్గదర్శకాలకు తోడు, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో సెంటిమెంట్ బలంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఐటీ, ఫార్మ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. నిఫ్టీ బ్యాంకు 1.28 శాతం లాభాలతో కొనసాగుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్ సీ భారీ లాభపడుతుండగా, ఆసియన్ పెయింట్స్, టాటా స్టీల్, హిందాల్కో, ఐవోసీ, ఐటీసీ తదితర షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment