దిగ్గజ ఔషధ కంపెనీ ‘సన్ ఫార్మా’ తాజాగా తన సన్‌స్క్రీన్ బ్రాండ్ ‘సన్‌క్రోస్’ను ఓటీసీ విభాగం కింద మళ్లీ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.
ముంబై: దిగ్గజ ఔషధ కంపెనీ ‘సన్ ఫార్మా’ తాజాగా తన సన్‌స్క్రీన్ బ్రాండ్ ‘సన్‌క్రోస్’ను ఓటీసీ విభాగం కింద మళ్లీ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. అంటే కంపెనీ ఈ ప్రొడక్ట్‌ను ఇక నుంచి ఓవర్ ద కౌంటర్ (ఓటీసీ) విభాగం కింద కూడా విక్రయిస్తుంది. ఇప్పటి వరకు సన్‌క్రోస్ కేవలం ప్రిస్క్రిప్షన్ విభాగంలోనే అందుబాటులో ఉండేది. ఇపుడది ఓటీసీ, ప్రిస్క్రిప్షన్ అనే రెండూ విభాగాల్లోనూ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.