న్యూఢిల్లీ: దేశీ ఫార్మా దిగ్గజం సన్ ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలానికి రూ. 1,572 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 1,362 కోట్లతో పోలిస్తే ఇది 15% అధికం. ఇదే కాలానికి నికర అమ్మకాలు కూడా 13% పుంజుకుని రూ. 4,751 కోట్లకు చేరాయి. అంచనాలకు అనుగుణంగా గరిష్ట స్థాయిలో లాభదాయకతను సాధించగలిగినట్లు కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వి పేర్కొన్నారు.
దేశీయంగా బ్రాండెడ్ జనరిక్స్ అమ్మకాలు 21% ఎగసి రూ. 1,152 కోట్లను తాకగా, యూఎస్‌లో ఫినిష్డ్ డోసేజ్ విక్రయాలు 15% పెరిగి 48.1 కోట్ల డాలర్లకు చేరినట్లు కంపెనీ తెలిపింది. ఇందుకు టారో పనితీరు దోహదపడినట్లు వెల్లడించింది. కాగా, పరిశోధన, అభివృద్ధి విభాగంపై దాదాపు 7% అధికంగా రూ. 312 కోట్లను వెచ్చించినట్లు వివరించింది. సమీక్షా కాలంలో మెర్క్‌అండ్ కంపెనీతో టిల్డ్రాకిజుమాబ్ ఔషధానికి సంబంధించి ప్రపంచవ్యాప్త ప్రత్యేక లెసైన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
సన్ ఫార్మా లాభం 15 శాతం ప్లస్
Published Fri, Nov 14 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM
Advertisement
Advertisement