Research and Development
-
ఔషధ పరిశోధన రంగం వృద్ధికి సూచనలు
దేశీయంగా ఫార్మాస్యూటికల్ పరిశోధన, అభివృద్ధి భవిష్యత్‌ను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయని డెలాయిట్, అసోచామ్ సంయుక్త నివేదిక తెలిపింది. ఈ దిశగా అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం, మేధో సంపత్తి (ఐపీ) హక్కులను కాపాడడం, ఆవిష్కరణలను ప్రోత్సాహించడం కీలకమని పేర్కొంది. ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమలో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ)కి ఇప్పటికీ విధానపరమైన సవాళ్లు నెలకొంటున్నట్లు తెలిపింది. నియంత్రణ కార్యాచరణను ఆధునికీకరించడం, అంతర్జాతీయ నియంత్రణ సంస్థలతో భారత ఫార్మా రంగం సమన్వయం చేసుకుంటుందని నివేదిక తెలిపింది. అయితే ఈ రంగం మరింత వృద్ధి చెందేందుకు ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలని సూచించింది.నివేదికలోని వివరాల ప్రకారం..ఔషధ నియంత్రణల పరంగా అత్యాధునిక పరీక్షా కేంద్రాల కొరత ఉంది. తయారీ యూనిట్లలో క్వాలిటీ నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు బలమైన కార్యాచరణ లేదు. దాంతో ఫార్మాస్యూటికల్ పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) వెనకబడుతోంది. ఏకరూప నియంత్రణ నిబంధనలు అమలు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయానికి అవకాశాలున్నాయి. ఇప్పటికే ఉన్న వివిధ నియంత్రణ సంస్థల మధ్య సమన్వయలోపం ఉంది. పాలనా పరమైన సమస్యల వల్ల ఔషధాలు, క్లినికల్ ట్రయల్స్ అనుమతులకు అదనపు సమయం అవసరమవుతుంది. ఫలితంగా అత్యున్నత నాణ్యతతో కూడిన క్లినికల్ పరిశోధనలకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా నిలవలేకపోతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చి చూస్తే నిబంధనల అమలుకు భారత్‌లో అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది సూక్ష్మ, చిన్న ఫార్మాస్యూటికల్ సంస్థలకు భారంగా మారుతుంది.ఇదీ చదవండి: వాటర్ బాటిల్ ధర తగ్గనుందా..?అంతర్జాతీయంగా ఫార్మాస్యూటికల్ ఆర్అండ్డీలో భారత్‌ను మెరుగైన స్థానంలో నిలిపేందుకు స్పష్టమైన నియంత్రణలు, సరళీకృత ప్రక్రియలు అవసరమని ఈ నివేదిక సూచించింది. అందుకోసం ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమని అభిప్రాయపడింది. అత్యాధునిక పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని తెలిపింది. ప్రభుత్వం, విద్యా సంస్థలు కలసి ఫార్మాస్యూటికల్ పరిశ్రమకు ప్రత్యేక కోర్సులు రూపొందించాలని సూచించింది. -
రూ.1 పెట్టుబడిపై రూ.13 ప్రతిఫలం..ఎక్కడంటే..
వ్యవసాయ పరిశోధన అభివృద్ధి(ఆర్అండ్డీ)లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలుంటాయని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (నాస్) ప్రెసిడెంట్ హిమాన్షు పాథక్ తెలిపారు. ప్రతి రూ.1 పెట్టుబడిపై రూ.13 ప్రతిఫలం లభిస్తుందన్నారు.నాస్ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..‘వ్యవసాయ పరిశోధన అభివృద్ధిలో పెట్టుబడులు లాభదాయకంగా మారనున్నాయి. ఆర్అండ్డీలో పెట్లే రూ.1 పెట్టుబడి సమీప భవిష్యత్తులో రూ.13 ప్రతిఫలం ఇస్తుంది. పశుసంవర్థక రంగంలో ఈ లాభాలు ఇంకా ఎక్కువగానే ఉంటాయి. వ్యవసాయ పరిశోధనా వ్యవస్థను మరింత మెరుగుపర్చాలి. పంటసాగు వ్యయాలు పెరగడం, తక్కువ ఉత్పాదకత, వాతావరణ మార్పు ప్రభావం రూపంలో ఈ రంగానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. సహజ వనరుల క్షీణత, తెగులు, వ్యాధుల సమస్యలు పెరుగుతున్నాయి. వీటి పరిష్కారానికి ఎన్నో పరిశోధనలు జరగాలి. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే రకాలను తయారుచేయాలి. అందుకోసం టెక్నాలజీను వినియోగించాలి’ అన్నారు.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్) డైరెక్టర్ జనరల్‌గా కూడా హిమాన్షు పాథక్ పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: సినీ, క్రికెట్ ప్రముఖులతో ‘వంతారా’ ప్రచారం -
ఐటీలో పరిశోధనలకు ప్రోత్సాహంపై ట్రాయ్ కసరత్తు
న్యూఢిల్లీ: టెలికం, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ రంగాల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించే మార్గాలను అన్వేíÙంచడంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పరిశ్రమ వర్గాలతో సంప్రదింపుల కోసం చర్చాపత్రాన్ని విడుదల చేసింది. ఐసీటీ రంగంలో ఆర్అండ్డీ కార్యకలాపాల కోసం ప్రస్తుతమున్న విధానం సరిపోతుందా లేక ప్రత్యేక ఏజెన్సీ ఏదైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా అనే విషయంపై అభిప్రాయాలను కోరింది. అలాగే, ప్రైవేట్ రంగం ఆర్అండ్డీని చేపట్టేలా ప్రోత్సహించేందుకు ట్యాక్స్ మినహాయింపులు, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలు వంటి విధానాలు ఎంత వరకు ఉపయోగకరంగా ఉంటాయనేది తెలపాలని సూచించింది. దీనితో పాటు పలు ప్రశ్నలను చర్చాపత్రంలో ట్రాయ్ పొందుపర్చింది. వాటిల్లో కొన్ని.. ► ఆర్అండ్డీ ప్రోగ్రామ్‌లకు తగినన్ని నిధులను, సకాలంలో మంజూరు చేసేందుకు పారదర్శకమైన విధానాన్ని అమలు చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవచ్చు? ► నవకల్పనల స్ఫూర్తిని పెంపొందించాలంటే రాష్ట్రాలకు ర్యాంకింగ్ విధానాన్ని అమలు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందా? ► భారత్‌లో పేటెంట్ ఫైలింగ్ వ్యయాలను తగ్గించాల్సిన అవసరం ఉందా? ఒకవేళ సమాధానం అవును అయితే, ఎలా చేయొచ్చు? -
సాగు పరిశోధనలో అమెరికా సహకారం కావాలి.. మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పరిశోధన రంగంలో అమెరికా సహకారం ఆశిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగం అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న నిరంజన్ రెడ్డి బృందం మూడో రోజు గురువారం వాషింగ్టన్ డీసీలో వ్యవసాయ శాఖ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఐటీ, ఫార్మ్ ఎకనామిక్స్, సీడ్ టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ తదితర రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలపై చర్చించింది. వాషింగ్టన్ డీసీలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు పథకం ప్రారంభించి రైతులకు పంట పెట్టుబడి ఇస్తున్నామన్నారు. ఎన్ఐఎఫ్ఏ డైరెక్టర్ మంజిత్ మిశ్రా మాట్లాడుతూ వ్యవసాయ అభివృద్ధికి పరిశోధన చాలా ముఖ్యమన్నారు. కానీ ఆ పరిశోధనను అర్థవంతమైన ఫలితాలుగా మార్చడంలో రాజకీయ నాయకుల పాత్ర చాలా కీలకమని చెప్పారు. నిరంజన్ రెడ్డి వెంట వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ ఉన్నారు. ఇది కూడా చదవండి: వీవోఏల గౌరవ వేతనం రూ.8 వేలకు పెంపు -
మహిళా పోలీస్..లెక్కలో లెస్..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర జనాభాలో మహిళలు దాదాపు సగం (49.7 శాతం) ఉన్నప్పటికీ... మహిళా పోలీసుల శాతం మాత్రం ఇప్పటికీ నామమాత్రంగానే ఉంది. కేంద్రం అధీనంలోని బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్ అండ్ డీ) గణాంకాల ప్రకారం రాష్ట్ర పోలీసు విభాగంలో పనిచేస్తున్న మొత్తం సిబ్బంది, అధికారుల సంఖ్య 62,731గా ఉండగా అందులో మహిళా పోలీసులు కేవలం 5,349 (8.53 శాతం) మందే ఉన్నారు. 2021 జనవరి నాటి పరిస్థితుల ఆధారంగా... బీపీఆర్ అండ్ డీ ఏటా అన్ని రాష్ట్రాలు, కమిషనరేట్లలో పోలీసు సిబ్బంది వివరాలను సేకరిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న జనాభాతో పురుష–మహిళా పోలీసులు, సివిల్–ఆర్మ్డ్ రిజర్వ్ బలగాల్లోని సిబ్బందిని గణించి నివేదిక రూపొందిస్తోంది. 2021 జనవరి నాటి గణాంకాల ఆధారంగా అధ్యయనం చేసిన బీపీఆర్ అండ్ డీ... రాష్ట్రంలో మహిళలకు అవసరమైన స్థాయిలో మహిళా పోలీసులు లేరని స్పష్టం చేసింది. అయితే అన్ని రాష్ట్రాలూ మహిళా పోలీసు పోస్టుల సంఖ్య పెంచడంతోపాటు భర్తీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఉన్న సిబ్బందికీ సమస్యలెన్నో... ప్రస్తుతం పోలీసు విభాగంలో ఉన్న మహిళా సిబ్బందిని ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. చాలా మంది మహిళా పోలీసులు స్థూలకాయంతో బాధపడుతున్నారు. వ్యాయాయం లేకపోవడం, ఏళ్ల తరబడి కార్యాలయ విధులకే పరిమితం కావడంతో బందోబస్తు డ్యూటీ చేయాల్సి వస్తే నిరసనకారులను అదుపు చేయడం వారికి సాధ్యం కావట్లేదు. కొత్తగా విధుల్లో చేరిన యువ మహిళా సిబ్బంది మినహా మిగిలిన వారిలో అనేక మందికి ఈ సమస్యలు ఉన్నాయి. మహిళా పోలీసు సిబ్బంది కొరత తీర్చడంతోపాటు ఉన్న వారిలోనూ నైపుణ్యాలు మెరుగుపరచడానికి ఉమ్మడి రాష్ట్రంలో తెరపైకి వచ్చిన ప్రతిపాదనలు ఇప్ప టికీ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. మహిళా పోలీసులకు సమకాలీన అంశాలపై అవగాహన కల్పించడం, వృత్తిలో మెళకువలు నేర్పే ఉద్దేశంతో క్రాష్‌కోర్స్ నిర్వహించాలని గతంలో భావించారు. అయితే ఈ ప్రక్రియ కొందరికి పూర్తయినా మిగిలిన వారికి ఆగిపోయింది. ప్రత్యేక మహిళా బెటాలియన్ ఏర్పాటుకు సన్నాహాలు చేసినా ఆచరణకి రాలేదు. ఎట్టకేలకు లా అండ్ ఆర్డర్‌కు నేతృత్వం.. హైదరాబాద్‌లోని మూడు కమిషరేట్లలో 150కిపైగా లా అండ్ ఆర్డర్ పోలీసుస్టేషన్లు, ఐదు మహిళా ఠాణాలు ఉన్నాయి. మహిళా ఠాణాలకు ఉమెన్ ఆఫీసర్లే నేతృత్వం వహిస్తున్నా చాలాకాలం వరకు మూడు కమిషనరేట్లలో ఏ ఒక్క శాంతి భద్రతల విభాగం పోలీసుస్టేషన్‌కు మహిళా పోలీసును స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)గా నియమించిన దాఖలాలు లేవు. అయితే హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గతేడాది మహిళా దినోత్సవం రోజు లాలాగూడ ఠాణాకు మధులతను మొదటి మహిళా ఎస్హెచ్ఓగా నియమించారు. మరోవైపు గతంలో మహిళా పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినా అభ్యర్థి నుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన ఉండేది కాదని... తాజాగా చేపట్టిన పోలీసు రిక్రూట్మెంట్లో స్త్రీలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వడంతోపాటు వారికి అనేక వెసులుబాట్లు కల్పించడంతో పోలీసు విభాగంలో అతివల కొరత చాలా వరకు తీరుతుందని అధికారులు చెబుతున్నారు. -
ఈ దఫా ‘నెవ్వర్ బిఫోర్’ బడ్జెట్
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ (2021–22) ఈ దఫా ‘ఇంతకు ముందెన్నడూ చూడని’ (నెవ్వర్ బిఫోర్) విధంగా ఉంటుందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారమన్ పేర్కొన్నారు. మహమ్మారి కరోనా విసురుతున్న సవాళ్లను ఎదుర్కొని, వృద్ధిబాటలోకి దూసుకుపోయే బడ్జెట్‌ను ఈ సారి ప్రవేశపెడుతున్నట్లు ఆమె వివరించారు. మహమ్మారి సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో వస్తున్న ఈ తరహా బడ్జెట్, 100 సంవత్సరాల భారత్ ముందెన్నడూ చూసి ఉండదని ఆమె అన్నారు. ఆరోగ్యం, మెడికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) టెలీమెడిసిన్ నిర్వహణలో నైపుణ్యత పెంపు అంశాలపై పెట్టుబడుల పెంపు ప్రస్తుత కీలక అంశాలని శుక్రవారం జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆమె అన్నారు. ‘నెవ్వర్ బిఫోర్’ బడ్జెట్ రూపకల్పనలో అందరి భాగస్వామ్యం అవసరం అని కూడా ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2021 ఫిబ్రవరి 1వ తేదీన సీతారామన్ పార్లమెంటులో 2021–22 బడ్జెట్‌ను ప్రవేశపెడతారని భావిస్తున్నారు. ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయాలు పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్న తరుణంలో ఆర్థికమంత్రి ఈ రంగాన్ని ప్రస్తావించడం గమనార్హం. మెడికల్ టెక్నాలజీలో అవకాశాలు: ఫార్మా కార్యదర్శి అపర్ణ దేశంలో మెడికల్ టెక్నాలజీ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శి ఎస్.అపర్ణ తెలిపారు. ఈ రంగం వృద్ధి బాటలో ఉందని, మరింత విస్తరణకు అవకాశం ఉందని అన్నారు. సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్‌లో మెడికల్ టెక్నాలజీ భవిష్యత్ అన్న అంశంపై శుక్రవారం ఆమె మాట్లాడారు. ‘భారత్‌లో 4,000 పైచిలుకు హెల్త్‌టెక్ స్టార్టప్స్ ఉన్నాయి. ఆవిష్కరణలు, వ్యవస్థాపకత స్ఫూర్తికి ఇది నిదర్శనం. యువతలో ఉన్న స్వాభావిక ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ప్రభుత్వం ఈ రంగంపై ప్రత్యేక దృష్టిసారించింది. ప్రస్తుత సంవత్సరంలో ఈ రంగానికి అపూర్వ ఆర్థిక సహాయాన్ని చూశాం. దేశంలో తొలిసారిగా మెడికల్ టెక్నాలజీ రంగానికి వచ్చే అయిదేళ్లపాటు సుమారు రూ.7,500 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి. వైద్య పరికరాల పార్కుల రూపంలో మౌలిక సదుపాయాల ఏర్పాటు ద్వారా ఈ ఆర్థిక మద్దతు కొనసాగుతోంది. వైద్య పరికరాలకూ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఉన్నాయి’ అని వివరించారు. -
నిర్మాణ కార్మికులు దొరకట్లేదు!
మియాపూర్‌లోని ఓ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కారణం, నిధుల్లేక కాదు.. లేబర్ దొరక్క! సార్వత్రిక ఎన్నికలని వెళ్లిన కార్మికులు తిరిగి రావట్లేదనేది కాంట్రాక్టర్ వాదన. పోనీ, స్థానిక లేబర్స్‌తో పనులను చక్కబెట్టేద్దామంటే? నైపుణ్య సమస్య! .. ఇది కేవలం ప్రైవేట్ డెవలపర్లే కాదండోయ్.. హౌసింగ్ ఫర్ ఆల్, కేసీఆర్ 2 బీహెచ్‌కే వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా గృహాల నిర్మాణం ఆలస్యమవుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం దేశీయ నిర్మాణ రంగంలో 5 కోట్ల మంది కార్మికులున్నారు. ఇందులో నైపుణ్యమున్న కార్మికులు 2 కోట్ల లోపే. పస్తుతం 6.42 లక్షల మంది సివిల్ ఇంజనీర్లు, 65 వేల మంది ఆర్కిటెక్ట్‌లు, 18 వేల మంది ప్లంబర్లు అందుబాటులో ఉన్నారు. 2022 నాటికి ఈ రంగంలో 8.3 కోట్ల మంది కార్మికులు అవసరం ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కార్మికులతో పాటూ ప్లానర్స్, ఇంజనీర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, సర్వేయర్స్, ఆర్కిటెక్ట్స్ వంటి అన్ని విభాగాల్లోనూ మానవ వనరుల అవసరం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 2 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్‌లో 70–75 వేల మంది నిర్మాణ కార్మికులుంటారు. గతంలో ఒంగోలు, శ్రీకాకుళం ప్రాంతాల కార్మికులు హైదరాబాద్ నిర్మాణ రంగంలో పనిచేసేవాళ్లు. కానీ, ప్రభుత్వ ఉచిత పథకాల కారణంగా చాలా వరకు కార్మి కుల వలస తగ్గిపోయింది. దీంతో బిహార్, మహారాష్ట్ర, కోల్‌కతా, వెస్ట్ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, అస్సాం, ఒరిస్సా రాష్ట్రాల కార్మికుల మీద ఆధారపడాల్సి వస్తుంది. కార్మికుల ధరలివే: రోజుకు మేస్త్రీకి రూ.700–900, లేబర్ (మగవారికి) రూ.450–500, ఆడవాళ్లకు 300–350, షటరింగ్కు చ.అ.కు రూ.12–14, రాడ్ బెండింగ్ టన్నుకు రూ.6,000. ఎందుకు తగ్గిపోయారంటే? ► ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లోనే నిర్మాణ పనులు జరుగుతుండటంతో మెట్రో నగరాలకు కార్మికుల వలస తగ్గింది. ► సార్వత్రిక ఎన్నికల కని వెళ్లిన కార్మికులు తిరిగి పనులకు రాకపోవటం. ► కార్మికుల్లో కష్టపడే తత్వం తగ్గిపోవటం. గ్రామీణ, పట్టణాల్లోని యువత ప్రధాన నగరాల్లో మేస్త్రీలు, కార్పెంటర్లుగా పనిచేయడానికి ఇష్టపడకపోవటం. ► వేతన అసమానతలు, కఠినమైన పని షెడ్యూల్డ్స్, ప్రసూతి సెలవులు లేకపోవటం. ప్రతికూల వాతావరణ పరిస్థితులు. ► కనీస అవసరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తీరుస్తుండటం. ► ఉచిత విద్య, నిరుద్యోగ భృతి, పింఛన్లు, బీమా, ఇల్లు ప్రభుత్వమే అందిస్తుండటం. కార్మికుల కొరతతో ఏమవుతుందంటే? ► ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్మికులు, అరకొర పనిముట్లతో పూర్తి స్థాయిలో నిర్మాణ పనులను చేయలేరు. ► కొనుగోలుదారులకు ఇచ్చిన గడువులోగా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాదు. నిర్మాణం నాణ్యత దెబ్బతింటుంది. ► కార్మికులు, నిర్మాణ వ్యయం పెరుగుతుంది. కాబట్టి దాని ప్రభావం కంపెనీ కార్యకలాపాల మీద పడుతుంది. అంతిమంగా స్థిరాస్తి ధరలు పెరుగుతాయి. ► కంపెనీలకు నైపుణ్యమున్న మానవ వనరుల నియామకం, శిక్షణ భారంగా మారుతుంది. టెక్నాలజీనే సరైన మందు.. నిర్మాణ పనుల్లో సాంకేతికతను వినియోగించడం ద్వారా కార్మికుల కొరతను అధిగమించవచ్చు. 80 శాతం కార్మికుల కొరతను టెక్నాలజీ భర్తీ చేస్తుంది. ఉదాహరణకు హై రైజ్ భవనాల్లో మైవాన్ టెక్నాలజీ, ప్రీ–కాస్ట్‌తో వాల్స్, కాలమ్స్, బీమ్స్ల ఏర్పాటు, రోబోటిక్స్‌తో పెయింటింగ్ వంటివి. నిర్మాణ పనుల్లో సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కూడా ముందుకురావాలి. పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. డెవలపర్ల సంఘాలతో కలిసి ప్రభుత్వం కార్మికులకు నైపుణ్య శిక్షణతో పాటూ పూర్తి స్థాయి పనిముట్లను సమకూర్చాలని సూచిస్తున్నారు. చిన్న, మధ్య స్థాయి డెవలపర్లకు చుక్కలే.. హై రైజ్ భవనాలు, ఒకే రకమైన గృహ సముదాయాలకు, కమర్షియల్ ప్రాజెక్ట్‌లకు మైవాన్ షటరింగ్ టెక్నాలజీ కరెక్ట్. చిన్న ప్రాజెక్ట్‌లకు ఈ టెక్నాలజీని వినియోగించలేం. ఎందుకంటే డెవలపర్లకు వ్యయం భారంగా మారుతుందని ఓ డెవ లపర్ తెలిపారు. నైపుణ్యమున్న కార్మికుల కొరత కారణంగా 100 మంది పనిచేయాల్సిన చోట 20 మంది మాత్రమే ఉంటున్నారని పేర్కొన్నారు. 7–8 అంతస్తుల్లోపు నిర్మాణాలు చేపట్టే 85 శాతం చిన్న, మధ్య స్థాయి డెవలపర్లకు కార్మికులు దొరక్క ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఆర్అండ్డీ అవసరం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకపోవటంతో పెద్ద ప్రాజెక్ట్‌లకు అందుబాటులో ఉన్నంత సులువుగా, సౌకర్యవంతంగా చిన్న, మధ్య స్థాయి డెవలపర్లకు అందట్లేదు. ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థలు మేనేజ్మెంట్తో పాటూ నిర్మాణ సాంకేతికత మీద కూడా పరిశోధనలు చేయాల్సిన అవసరముంది. – ఇంద్రసేనా రెడ్డి, ఎండీ, గిరిధారి హోమ్స్ ప్రీ–కాస్ట్ గృహాల మీద అవగాహన కల్పించాలి ప్రధాన నగరంలో ప్రీ–కాస్ట్ తయారీ యూనిట్లను నెలకొల్పి.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు ఉత్పత్తులను సరఫరా చేయాలి. ఇందుకోసం ప్రభుత్వం, డెవలపర్ల సంఘాలు ముందుకురావాలి. ప్రీ–కాస్ట్ గృహాల అన్ని రకాల వాతావరణ పరిస్థితులు తట్టుకోవనో లేదా నాణ్యత విషయంలోనో ప్రజల్లో ఉన్న అపోహను తొలగించాలి. ఇందుకోసం డెవలపర్ల సంఘాలు, ప్రభుత్వం విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలి. – సీ రామచంద్రా రెడ్డి, జనరల్ సెక్రటరీ, క్రెడాయ్ రెరా, జీఎస్టీ, బినామీ ట్రాన్స్యాక్షన్ యాక్ట్ వంటి చట్టాలతో దేశంలో రియల్టీ లావాదేవీలు పారదర్శకత, వేగం, జవాబుదారీతనం పెరిగింది. దీంతో ఎన్ఆర్ఐ వ్యక్తిగత పెట్టుబడులు, ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. బెంగళూరు, ముంబై, చెన్నై, పుణె, హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్ వంటి ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్, మాల్స్, గ్రేడ్–ఏ ఆఫీస్‌లు, కో–వర్కింగ్ ప్రాపర్టీలకు డిమాండ్ ఉంది. -
రాష్ట్రంలో శాంసంగ్ ఆర్ అండ్ డీ సెంటర్!
► ఏర్పాటుకు ఆహ్వానించిన మంత్రి కేటీఆర్ ► ప్రపంచంలోనే అత్యుత్తమ ప్యాకేజీ అందించేందుకు సిద్ధమని స్పష్టం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న వైద్య పరికరాల ఉత్పత్తి పారిశ్రామికవాడలో యూనిట్‌ను ఏర్పాటు చేయాలని శాంసంగ్ సంస్థ ను పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామా రావు ఆహ్వానించారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా గురువారం పరిశ్రమలు, ఐటీ శాఖ కార్య దర్శి జయేశ్ రంజన్‌తో కలసి శాంసంగ్ ఇన్నో వేషన్ మ్యూజియంను మంత్రి సందర్శించారు. అనంతరం శాంసంగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగ్ మోయిమ్, వైస్ ప్రెసిడెంట్ పీటర్ రీ బృందంతో సమావేశమైన మంత్రి.. హైదరాబాద్‌లో శాంసంగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేసి స్థానిక భాషల్లో ఉత్పత్తులు రూపొందించాలని కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు శాంసంగ్ ముందుకొస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ ప్యాకేజీ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎలక్ట్రానిక్ పరిశ్ర మలకు రాష్ట్రంలో కల్పించే మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలు, రాష్ట్ర పరిశ్రమల పాలసీ గురించి శాంసంగ్ ప్రతినిధులకు మంత్రి వివరించారు. రాష్ట్రంలో కొరియన్ పారిశ్రామిక పార్కు రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, లైఫ్ సైన్సెస్, ఆటోమోటివ్, మెషినరీ, ఇంజనీరింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అపార అవకాశాలున్నా యని దక్షిణ కొరియా పారిశ్రామికవేత్తలకు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ దక్షిణ కొరియా ఆధ్వర్యంలో సియోల్ లో ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తల సదస్సులో మంత్రి ప్రసంగించారు. దక్షిణ కొరియాలో భారత రాయబారి విక్రం దొరై స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో కొరియన్ సంస్థల కోసం ప్రత్యేక కొరియన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణకు వచ్చే ప్రతి కొరియన్ పెట్టుబడికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. దేశంలో ఉత్తమ సదుపాయాలు, విధానాలు ఉన్న తెలంగాణ రాష్ట్రమే కొరియన్ కంపెనీలకు ఆకర్షణీయ ప్రాంతమన్నారు. తెలంగాణ రాష్ట్రం గురించి, ప్రభుత్వ విధానాల గురించి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా అక్కడి పారి శ్రామికవేత్తలకు వివరించారు. -
మిర్రర్ అండ్ ఎర్రర్!
హ్యూమర్ మిర్రర్స్ అండ్ ఎర్రర్స్ అండ్ కో అనే అద్దాల కంపెనీలోని ఉద్యోగులంతా కొత్త బిజినెస్ ఐడియా కోసం మేధోమథనం చేస్తున్నారు. అద్దాలన్నీ రొటీన్‌గా ఉంటు న్నాయి. కొత్తరకం అద్దం ఏదైనా తయారు చేద్దామన్నది ఆ మీటింగ్ ఉద్దేశం. అంతలో ఓనర్‌కు తటాలున ఒక ఐడియా తట్టింది. దాన్ని ప్రకటించగానే మిగతా భాగస్వాములంతా సంతోషంగా ఆమోదించారు. ‘‘నువ్వు వెంటనే ఆ ఫార్ములా ఏమిటో తెలుసుకొని ఆ తరహా అద్దాలు తయారు చెయ్. ఇక పిచ్చి సేల్స్. బ్లాకులో అమ్మినా అమ్ముతారు’’ అని ఆదేశించాడు కంపెనీ ఓనర్. వెంటనే రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ వాళ్లను పిలిపించారు. అందులో ఒక చీఫ్ సైంటిస్టుకూ ఆ ఐడియా విపరీతంగా నచ్చింది. ‘‘భలే వచ్చింది సార్ మీకు ఐడియా. ఈ ఐడియాకు ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా?’’ అడిగాడు సైంటిస్ట్. ‘‘ఏమీ లేదయ్యా. రాత్రి మాయా బజార్ సినిమా చూశా. అందులోని పాత్ర ధారులంతా ఒక అద్దంలోకి చూస్తుంటారు కదా. మన టీవీలాంటిదే కదా ఆ అద్దం అనిపించింది మొదట్లో. కానీ తర్వాత గబుక్కున ఒక ఐడియా వచ్చింది. ఆ సినిమాలో ఉన్న తరహా మిర్రర్స్ చేసి అమ్మాం అనుకో.. సావిత్రికి ఏఎన్నార్ కనిపించినట్టు... దానిలోకి చూసిన వాళ్లందరికీ వాళ్ల లవర్స కనిపిస్తారని చెప్పామనుకో... ఇక అందరూ దాని కోసం ఎగబడతారు. ఓల్డేజి వాళ్లూ తమ లవర్స్ ఎవరో చూసుకోడానికి ఉవ్వి ళ్లూరుతారు. ‘వాలెంటైన్స్ డే’ నాడు ఈ ‘లవర్స్ మిర్రర్స్’ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తే సందర్భానికి తగినట్లుగా కూడా ఉంటుంది’’ అన్నాడు మిర్రర్స్ అండ్ ఎర్రర్స్ యజమాని సంతోషంగా. ‘‘చాలా బాగుంటుంది సార్. అసలు ఐడియా వినడానికే ఎక్సైటింగ్‌గా ఉంది. అంతెందుకు, నా లవర్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది సార్’’ అన్నాడు అప్పుడే చేరిన యంగ్ అప్రెంటిస్ ఒకడు. ‘‘ఈ బిజినెస్ ఐడియా సూపర్‌గా ఉంది సార్. మారేజ్ బ్యూరోలూ, మ్యాట్రి మోనియల్ కంపెనీలకూ అమ్మవచ్చు. నిజానికి మనం అమ్మాల్సిన అవసరం లేదు సార్. తమ దగ్గర ఇలాంటి సదు పాయం ఉందనీ, సంబంధాలు వెతకడం అంతా షార్ట్‌కట్‌లో అయిపోతుందని వాళ్లంతా మనకు బోలెడు ఆర్డర్స్ ఇస్తారు’’ అన్నాడు బిజినెస్ డెవెలప్మెంట్ వింగ్ అధికారి. ‘‘అవున్సార్. మన టీవీ యాడ్స్‌లో ఈ క్లిప్పింగ్నూ చూపిద్దాం. ‘శశిరేఖకు అభిమన్యుడు, మరి మీకు ఎవరు...?’ అనేది మన టీవీ యాడ్ క్యాంపెయినింగ్ క్యాప్షన్. యూత్‌ను ఆక ర్షించే పవర్ఫుల్ స్లోగన్స్ కూడా తయారు చేద్దాం’’ అన్నాడు క్రియేటివ్ డెరైక్టర్. ‘‘నిజమే సార్. బ్రాండ్ అబాసిడర్స్గా స్టార్సని తీసుకోవాలి. మీరు చెప్పిన మాయాబజార్లోని శ్రీకృష్ణుడినే తీసుకుంటే దిగులే లేదు. పైగా ఆయన తనను లవ్ చేసిన రుక్మిణిని చేసుకున్నాడు. సొంత చెల్లెలు సుభద్ర అర్జునుడిని లవ్ చేస్తే వాళ్లకి పెళ్లి చేశాడు. అన్న కూతురు శశిరేఖ, చెల్లెలి కొడుకు అభిమన్యుడిని లవ్ చేస్తే అదీ సక్సెస్ అయ్యేలా చేశాడు. ఆ సినిమా చూసే కద్సార్ మీకు ఈ ఐడియా వచ్చింది’’ అన్నాడు మరో సబార్డినేట్. ‘‘వాట్ యాన్ ఐడియా సర్జీ’’ అన్నాడు మరో ఉద్యోగి. ‘‘ఇదంత వర్కవుట్ కాదనుకుంటా సర్’’ ఆ సంతోషపు మూడ్స్ చెడగొడుతూ మూల నుంచి ఒక గొంతు వినిపించింది. ‘‘ఏం మాట్లాడుతున్నారండీ...’’ అంటూ ఒక్కసారే అరిచారంతా. బాస్ ఐడియాను మెచ్చుకోని వాళ్లంతా మూకుమ్మడిగా ఆ గొంతు తాలూకు ఓనర్ ఎవరా అని ఆ వైపునకు తిరిగారు. అందరూ అవుననే దాన్ని ఎవడైతే కాదంటాడో వాడే రాంబాబు. ‘‘అయినా ఎంత ధైర్యం... ఇంత సేలబుల్ ఐడియాను బాస్ చెబితే కాదం టారా? పైగా అంత క్రియేటివ్ ఫ్యాంటసీ అద్దాన్ని రియల్‌గా తయారు చేయ బోతుంటే... తయారు కాకముందే ఆ అద్దాన్ని బద్దలు కొడు తున్నారా? హౌ శాడ్’’ అంటూ నిట్టూర్చారు ఒకరిద్దరు. ‘‘అవున్సార్. ఇది ఫ్యాంటసీ రియాలిటీ అయినా... అది అందు బాటులోకి రాకముందే ప్రొడక్ట్ చచ్చి పోతుంది సార్. ఇందులో పెద్ద ఆలో చించాల్సిందేమీ లేదు, చిన్న లాజిక్.’’ ‘‘మీకు మాత్రమే తెలిసిన ఆ లాజిక్ ఏమిటో?’’ వ్యంగ్యంగా అడిగాడు ఓనర్. ‘‘ఏమీ లేదు సార్. మీరు మీ లవర్ ఎవరో అందులో చూస్తారు. మీ ఆవిడ అదే మిర్రర్‌లోకి చూసినప్పుడు... ఇంకెవడో గానీ కనపడితే ఏముంద్సార్. కాపురం కొలాప్స్. అదే ఈ మిర్రర్‌లోని ఎర్రర్’’ అన్నాడు రాంబాబు. - యాసీన్ -
సన్ ఫార్మా లాభం 15 శాతం ప్లస్
న్యూఢిల్లీ: దేశీ ఫార్మా దిగ్గజం సన్ ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలానికి రూ. 1,572 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 1,362 కోట్లతో పోలిస్తే ఇది 15% అధికం. ఇదే కాలానికి నికర అమ్మకాలు కూడా 13% పుంజుకుని రూ. 4,751 కోట్లకు చేరాయి. అంచనాలకు అనుగుణంగా గరిష్ట స్థాయిలో లాభదాయకతను సాధించగలిగినట్లు కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వి పేర్కొన్నారు. దేశీయంగా బ్రాండెడ్ జనరిక్స్ అమ్మకాలు 21% ఎగసి రూ. 1,152 కోట్లను తాకగా, యూఎస్‌లో ఫినిష్డ్ డోసేజ్ విక్రయాలు 15% పెరిగి 48.1 కోట్ల డాలర్లకు చేరినట్లు కంపెనీ తెలిపింది. ఇందుకు టారో పనితీరు దోహదపడినట్లు వెల్లడించింది. కాగా, పరిశోధన, అభివృద్ధి విభాగంపై దాదాపు 7% అధికంగా రూ. 312 కోట్లను వెచ్చించినట్లు వివరించింది. సమీక్షా కాలంలో మెర్క్‌అండ్ కంపెనీతో టిల్డ్రాకిజుమాబ్ ఔషధానికి సంబంధించి ప్రపంచవ్యాప్త ప్రత్యేక లెసైన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
నైపుణ్యానికి స్వాగతం పలుకుతున్న జర్మనీ
జర్మనీ.. ఐరోపా ఖండం పశ్చిమ, మధ్య ప్రాంతంలో నెలవైన దేశం.. శాస్త్రసాంకేతిక రంగాల్లో ఆ దేశం సాధించిన విజయాలు ఎంతో విలువైనవి.. ఒక రకంగా జర్మనీ ఆర్థిక వృద్ధికి పరిశోధనలు-అభివృద్ధి (రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) రంగం ఇంధనంగా పని చేస్తోంది.. సైన్స్ రంగంలో అత్యధిక నోబెల్ బహుమతులు అందుకున్న ఘనత కూడా ఈ దేశం సొంతం.. అటువంటి జర్మనీ ఇప్పుడు భారతీయ యువత కలలకు వేదికగా మారుతోంది.. విజ్ఞాన సముపార్జనకు నిలయంగా మారుతోంది.. అమెరికా, యూకేల కంటే జర్మనీలో ఉన్నత విద్యనభ్యసించడానికి భారతీయ విద్యార్థులు ప్రాధాన్యతనిస్తున్నారు.. ఇందుకు దోహదం చేస్తున్న కారణాలు, ఏయే కోర్సులకు డిమాండ్ ఉంటోంది తదితర అంశాలపై విశ్లేషణ.. నాటి నుంచి నేటి వరకు జర్మనీ అంటే సహజంగానే శాస్త్రసాంకేతిక రంగాల్లో ఆ దేశం సాధించిన విజయాలు స్ఫూరణకు వస్తాయి. అంతేకాకుండా అంతర్జాతీయ ఆటోమొబైల్ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా కూడా ఈ ఐరోపా దేశం భాసిల్లుతోంది. మారుతున్న అవసరాలకనుగుణంగా టెక్నాలజీని మెరుగుపరచడం, రూపొందించడంలో అన్ని దేశాల కంటే ఒక అడుగు ముందు ఉంటుంది. పరిశోధనల్లో ప్రపంచవ్యాప్తంగా పైచేయి.. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా సంస్థలు.. ప్రవేశాల విషయంలో సరళీకృత నిబంధనలు.. ఇదీ జర్మనీలో ఉన్నత విద్య కోసం ఆసక్తి చూపించడానికి దోహదపడుతున్న అంశాలు ఇటువంటి నేపథ్యం ఉండడంతో ఇక్కడి యూనివర్సిటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు ఉత్సాహం చూపిస్తుంటారు. పరిశోధనలే.. ప్రధానం భారతీయ విద్యార్థులు ఆకర్షితులవ్వడానికి ప్రధాన కారణం అక్కడి వర్సిటీ పరిశోధనలే. ఆయా యూనివర్సిటీల్లో ప్రవేశ దరఖాస్తులను డాక్టరేట్ కమిటీలే పరిశీలిస్తాయి. అంతేకాకుండా ప్రొఫెసర్లతో ఒక్కొక్క రీసెర్చ్ స్కాలర్ పనిచేసే సదుపాయం కూడా పరిశోధన మరింత మెరుగ్గా చేయడానికి దోహద పడుతుంది. దీంతోపాటు కొంత మంది స్కాలర్స్‌కు ఒక గ్రూప్ చొప్పున పరిశోధనలపై కసరత్తులు నిర్వహించడం ఇక్కడ అమల్లో ఉంది. మరో ప్రధాన అంశం.. ఇక్కడి అనుసరిస్తున్న ఇంటర్నేషనలైజేషన్ స్ట్రాటజీ. ఇందులో భాగంగా అంతర్జాతీయ విద్యార్థులు, పరిశోధకులను ఆకర్షించడానికి పలు కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఇందుకోసం జర్మనీ యూనివర్సిటీలు నిబంధనలను సైతం సరళతరం చేస్తున్నాయి. పోస్ట్ స్టడీ ఎంప్లాయిమెంట్ మరో కీలాకాంశం.. పోస్ట్ స్డడీ ఎంప్లాయిమెంట్. విదేశీ విద్యకు ప్రధాన కేంద్రాలుగా నిలుస్తోన్న దేశాలు..పోస్ట్ స్డడీ ఎంప్లాయిమెంట్ అంశంలో నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. దీంతో చాలా మంది దృష్టి జర్మనీపై పడింది. జర్మనీలో చదువు పూర్తయిన తర్వాత కూడా అక్కడే ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా ఈ విషయంలో ఎటువంటి నిబంధనలను విధించడం లేదు. వారి అర్హతకు సరిపడ ఉద్యోగాన్ని వెతుక్కునే స్వేచ్ఛను కల్పించింది. అంతేకాకుండా జర్మనీ యూనివర్సిటీలను ప్రపంచంలోనే ఉత్తమమైనవిగా భావిస్తారు. ఐరోపా కేంద్రంగా పని చేస్తున్న సంస్థలు అమెరికా, యూకే కంటే జర్మనీ వర్సిటీల్లో చదివిన విద్యార్థులను రిక్రూట్ చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ అంశం కూడా భారతీయ విద్యార్థుల నిర్ణయాన్ని అమితంగా ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా గ్రాడ్యుయేట్లు చదువు తర్వాత 18 నెలలపాటు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వొకేషనల్ శిక్షణ తీసుకున్న వారు ఏడాది వరకు అక్కడే ఉండొచ్చు. ఫీజు మినహాయింపు జర్మనీలో భారతీయ విద్యార్థుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా భావించాల్సిన అంశం..ఉచిత విద్య. ప్రతిభావంతులను ఆకర్షించే ఉద్దేశంతో భారతీయ విద్యార్థులకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు (కొన్ని యూనివర్సిటీల్లో). ఈ క్రమంలో ట్యూషన్ ఫీజు చెల్లించనక్కర్లేదు. బోర్డింగ్, లాడ్జింగ్ ఫీజులను చెల్లిస్తే సరిపోతుంది. ఇక్కడి అధిక శాతం యూనివర్సిటీలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అంతేకాకుండా ఇక్కడి యూనివర్సిటీలు ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి ఎన్నో రకాల స్కాలర్షిప్లను అందజేస్తున్నాయి. భారతీయ విద్యార్థుల్లో అధిక శాతం ఈ సదుపాయం ద్వారా లబ్ధి పొందుతున్నారు. జర్మనీ ప్రభుత్వం కూడా నైపుణ్యం ఉన్న యువతను ఆకర్షించే ఉద్దేశంతో వసతి, ఎంట్రీ పర్మిట్ నిబంధనలను అవసరాలకనుగుణంగా సరళతరం చేస్తోంది. 120 రోజులు విదేశాల్లో ఉన్నత విద్య అంటే.. సాధారణంగా విద్యార్థులు పార్ట్‌టైమ్ జాబ్ గురించి ఆలోచిస్తుంటారు. ఈ విషయంలో మిగతా దేశాల కంటే జర్మనీలో పరిస్థితి చాలా మెరుగ్గా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ క్రమంలో రెండేళ్ల కిత్రం కొన్ని సవరణలు చేశారు. ఇవి కూడా భారతీయులను ఆకర్షించాయని చెప్పొచ్చు. గతంలో కేవలం 90 రోజులు మాత్రమే పని చేసుకునేందుకు అవకాశం ఉండేది. సవరించిన నిబంధనల మేరకు సంవత్సరానికి 120 రోజులు పని చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక్కడ కొన్ని యూనివర్సిటీలు మాత్రం సెలవుల్లోనే ఈ సౌలభ్యం కల్పిస్తాయి. అతి స్వల్ప స్థాయిలో ఉన్నత విద్య కోసం జర్మనీకి ప్రాధాన్యతనివ్వడానికి మరో కారణం.. ట్యూషన్ ఫీజులు. అమెరికా, యూకే వంటి దేశాలతో పోల్చితే ఇక్కడ ట్యూషన్ ఫీజులు చాలా స్వల్పం. ఫీజులను సెమిస్టర్ వారీగా చెల్లించాలి. ఎంచుకున్న కోర్సును బట్టి 250 నుంచి 500 యూరోల వరకు ట్యూషన్ ఫీజును చెల్లించాలి. అంతేకాకుండా ఇతర అంశాల్లో ఖర్చు కూడా స్వల్పంగా ఉంటోంది. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రెండు విధాలుగా వసతి అందుబాటులో ఉంటుంది. వసతి, స్టడీ మెటీరియల్, దుస్తులు, ఇతర అవసరాల కోసం నెలకు 700 యూరోలు సరిపోతాయి. డీఏఏడీ జర్మనీలో విద్యకు సంబంధించి..జర్మన్ అకడమిక్ ఎక్స్ఛేంజ్ సర్వీస్(డీఏఏడీ) చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు కూడా భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. చాలా మంది ఔత్సాహికులకు అక్కడి విద్య, యూనివర్సిటీలు సంబంధిత అంశాలపై సరైన అవగాహన ఉండడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని డీఏఏడీ దేశ వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో ఏయే యూనివర్సిటీలు ఏయే కోర్సులను అందిస్తున్నాయి, వాటి ప్రవేశ ప్రక్రియ, వీసా తదితర అంశాలను క్షుణ్నంగా వివరిస్తారు. అంతేకాకుండా అక్కడి యూనివర్సిటీలు ప్రతిభావంతులకు అందజేస్తున్న స్కాలర్‌షిప్‌ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది. ఈ అంశం కూడా భారతీయ విద్యార్థులను ప్రభావితం చేస్తుంది. వీటికే ఓటు భారతదేశం నుంచి ఉన్నత విద్య కోసం జర్మనీ వెళ్తున్న విద్యార్థుల్లో అత్యధిక మంది సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులను ఎంచుకుంటున్నారు. వీటిలో మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, లైఫ్ సెన్సైస్, బయో సెన్సైస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, సంబంధిత కోర్సులకు సరైన వేదిక జర్మనీ అని భారతీయ విద్యార్థులు భావిస్తున్నారు. ఈ కోర్సులు బ్యాచిలర్, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి నాలుగు రకాల జర్మనీలోని యూనివర్సిటీలను నాలుగు రకాలుగా విభజించారు. అవి.. యూనివర్సిటీస్ ఆఫ్ అప్లయిడ్ సెన్సైస్, కాలేజ్ ఆఫ్ ఆర్ట్, ఫిల్మ్ అండ్ మ్యూజిక్, ప్రైవేట్ యూనివర్సిటీలు/చర్చిలు నిర్వహించే యూనివర్సిటీలు, యూనివర్సిటీలు. ఈ యూనివర్సిటీలు ఇంగ్లిష్ మాధ్యమంగా దాదాపు 1,600 ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. స్కోర్లు తప్పనిసరి జర్మనీలో మాస్టర్ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే టోఫెల్ (80/120), ఐఈఎల్టీఎస్ (6.5/9) స్కోర్ తప్పనిసరి. కొన్ని కోర్సులకు మాత్రం జీఆర్ఈ స్కోర్ అవసరం. మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జీమ్యాట్ స్కోర్ ఆవశ్యకం. జర్మన్ భాష ఇక్కడి కంపెనీల్లో ఉద్యోగం చేయాలంటే జర్మన్ భాష తప్పనిసరిగా తెలిసి ఉండాలి. అయితే మాస్టర్ డిగ్రీ పూర్తి చేసే సరికి ఉద్యోగం పొందడానికి సరిపోయే జర్మన్ భాష వస్తుంది. 6-9 నెలల ముందు జర్మనీ యూనివర్సిటీల్లో బోధన రెండు సెమిస్టర్ల విధానంలో కొనసాగుతోంది. ఇందులో సమ్మర్ సెమిస్టర్ ఏప్రిల్ నుంచి సె ప్టెంబర్ ఆఖరు వరకు..వింటర్ సెమిస్టర్ అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉంటోంది. కాబట్టి. ఆ సెషన్‌కు 6 నుంచి 9 నెలల ముందుగా సన్నాహాకాలను ప్రారంభించడం మంచిది. వీసా జర్మనీ ఎంబసీ లేదా కన్సల్టెన్సీ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, అకడమిక్ సర్టిఫికెట్లు, కావల్సిన పరీక్షల స్కోర్లు, జర్మన్ భాష పరిజ్ఞానం లేదా కోర్సులో భాగంగా నేర్చుకుంటానని నిరూపించే ధ్రువపత్రాలు, నివాస, వసతికి సరిపడ ఆర్థిక వనరులను చూపే పత్రాలతో వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. జర్మనీ చేరుకున్నాక విదేశీ విద్యార్థులు తప్పనిసరిగా రెసిడెన్స్ పర్మిట్ కలిగి ఉండాలి. ఇందుకోసం సంబంధిత రిజిస్ట్రేషన్ అథారిటీని సంప్రదించాలి. టాప్ నైన్ భారతీయ విద్యార్థులు అత్యధిక మంది జర్మనీలో టాప్ నైన్ టెక్ యూనివర్సిటీలను (టీయూ) ఎంచుకుంటున్నారు. వీటిని మన దగ్గరి ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లతో సమానంగా భావించవచ్చు. వీటిలో ఆర్డ బ్ల్యూటీ హెచ్ ఆచెన్, టీయూ బెర్లిన్, టీయూ బ్రౌస్క్వేంగ్, టీయూ డ్రమ్స్స్టాడ్ట్, టీయూ డ్రెస్డెన్, లైబ్నిజ్ యూనివర్సిటట్ హనోవర్, కార్ల్సుచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, టీయూ మ్యూనికన్, యూనివర్సిటట్ స్టుట్గార్ట్ యూనివర్సిటీలు ఉన్నాయి. 9,619 2013-14లో ఉన్నత విద్య కోసం జర్మనీ వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య. గత మూడేళ్లతో పోల్చితే ఈ సంఖ్య రెట్టింపు.