
ఫైల్ ఫోటో
అమెరికా స్మార్ట్‌పోన్ దిగ్గజం ఆపిల్ తన తదుపరి ఐఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేయనుందట. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 11ను సెప్టెంబర్‌లో లాంచ్ చేయనుందని తాజా లీక్‌ల ద్వారా తెలుస్తోంది. సెప్టెంబర్ రెండవ వారంలో ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్‌ను 11 ప్రొ, 11 ఆర్, 11 మాక్స్ పేరుతో మూడు మోడళ్లలో లాంచ్ చేయనుంది. 5జీ టెక్నాలజీ అప్‌గ్రేడ్, ట్రిపుల్ రియర్ కెమెరా లాంటి ఫీచర్లతో వీటిని తీసుకురానుందని సమాచారం.
సాధారణంగా సెప్టంబరు మాసంలో తన ఫ్లాగ్‌షిప్ డివైస్‌లను లాంచ్ చేయడం ఆపిల్ ఆనవాయితీగా పాటిస్తూ వస్తోంది. ఈ సాంప్రదాయాన్ని గత రెండేళ్లుగా మిస్ అవుతూ వస్తోంది. 2017 లో, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ సెప్టెంబరులో విడుదల చేయగా , ఐఫోన్ ఎక్స్‌ను నవంబర్‌లో తీసుకొచ్చింది. అయితే 2018 లో, ఐఫోన్ ఎక్స్ సెప్టెంబరులో, లోయర్-ఎండ్ ఐఫోన్ ఎక్స్ అక్టోబర్‌లో ప్రారంభించింది. 2019లో మాత్రం సెప్టెంబర్ సెంటిమెంట్‌ను ఫాలో కావాలని ఆపిల్ భావిస్తోందట.
మరోవైపు అమెరికా చైనా ట్రేడ్‌వార్ నేపథ్యంలో సెప్టెంబరు 1 నుంచి అమెరికాలో చైనా దిగుమతులపై 10శాతం సుంకాల విధింపు ప్రకటన చైనాలో ఆపిల్ విక్రయాలపై ప్రభావం చూపుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. తాజాగా సుంకాల విధింపును డిసెంబరు వరకు వాయిదా వస్తూ ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment