సీడీఎస్ఎల్ చైర్మన్గా కృష్ణమూర్తి | T. S. Krishna Murthy Appointed CDSL Chairman | Sakshi
Sakshi News home page

సీడీఎస్ఎల్ చైర్మన్గా కృష్ణమూర్తి

Published Thu, Jun 2 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

సీడీఎస్ఎల్ చైర్మన్గా కృష్ణమూర్తి

సీడీఎస్ఎల్ చైర్మన్గా కృష్ణమూర్తి

హైదరాబాద్: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్‌ఎల్) చైర్మన్‌గా టి.ఎస్.కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఈయన నియామకానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) ఆమోదం తెలిపిందని సీడీఎస్‌ఎల్ బోర్డు ఆఫ్ డెరైక్టర్స్ తెలియజేశారు. కృష్ణమూర్తి ఏప్రిల్ 8న సీడీఎస్‌ఎల్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ నియామకానికి తాజాగా సెబీ ఆమోదం ముద్ర వేసింది. కృష్ణ మూర్తి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన మాజీ అధికారి. ఈయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా పనిచేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ అధికారిగా తన కెరీర్‌ను ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement