టెలికం ఆదాయం 10% డౌన్: ట్రాయ్
న్యూఢిల్లీ: టెలికం రంగా నికి మొబైల్ టెలిఫోనీ, డేటా వంటి కన్సూమర్ సర్వీసుల నుంచి వచ్చే ఆదాయం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో తగ్గింది. ఆదాయం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 10.5 శాతం క్షీణతతో రూ.37,284 కోట్లకు తగ్గిందని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తెలిపింది.
కన్సూమర్ సర్వీసుల ఆదాయం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.41,681 కోట్లుగా నమోదయ్యిందని పేర్కొంది. ఆదాయం తగ్గుదలకు జియో ఉచిత సర్వీసులే ప్రధాన కారణమని ప్రధాన టెలికం కంపెనీలు ఆరోపిస్తున్నాయి.