ఆగస్టులో తగ్గిన టెలికం యూజర్లు
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం యూజర్ల సంఖ్య ఆగస్టులో సుమారు అర శాతం క్షీణించి 105.34 కోట్లకు తగ్గింది. అంతకు ముందు నెలలో (జులై) ఇది 105.88 కోట్లుగా ఉంది. ప్రధానంగా 4జీ టెక్నాలజీ రాకతో రిలయన్‌స కమ్యూనికేషన్‌స 2జీ కస్టమర్లను కోల్పోవడం దీనికి కారణమైంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ప్రకారం రిలయన్‌స కమ్యూనికేషన్‌స సీడీఎంఏ టెక్నాలజీ నుంచి ఎల్‌టీఈ (4జీ) టెక్నాలజీకి మారడంతో సీడీఎంఏ సబ్‌స్క్రరుుబర్స్ సంఖ్య 1.8 కోట్ల మేర ఆగస్టులో తగ్గింది. జులైలో కూడా ఆర్‌కామ్ 32 లక్షల మంది మొబైల్ కస్టమర్లను కోల్పోరుుంది. మొత్తం మీద జూన్-ఆగస్టు మధ్య కాలంలో ఆర్‌కామ్ ఆరో స్థానానికి పడిపోరుుంది. మరోవైపు, కొత్త కస్టమర్లను దక్కించుకోవడంలో బీఎస్‌ఎన్‌ఎల్ ముందువరుసలో నిల్చింది. మొత్తం మీద 9.23 కోట్ల కనెక్షన్లతో నాలుగో స్థానంలో ఉంది.