ఈఎస్‌ఐసీ నుంచి కొత్త పథకం
హైదరాబాద్: బండారు దత్తాత్రేయ నేతృత్వంలోని కేంద్ర కార్మిక శాఖ తాజాగా ప్రతి కార్మికుడినీ ఈఎస్‌ఐ స్కీమ్ కవరేజీ పరిధిలోకి తెచ్చేందకు ఒక పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా సంస్థలు/కంపెనీలు వారిఉద్యోగులను ఈఎస్‌ఐ స్కీమ్‌లో భాగస్వాములను చేయవచ్చని ఈఎస్‌ఐ కార్పొరేషన్ తెలిపింది. ఈ పథకం వచ్చే జనవరి 1 నుంచి మార్చి 31 వరకు అంటే మూడు నెలలపాటు అందుబాటులో ఉంటుంది.
అలాగేఈఎస్‌ఐ కేంద్రాల్లోని వైద్య సదుపాయాల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు ఈఎస్‌ఐ కార్పొరేషన్... రాష్ట్రాలతో కలిసి వెచ్చించే వ్యయ పరిమితిని రూ.2,150 నుంచి రూ.3,000 (ఇన్సూరెన్స్ కలిగిన వ్యక్తి చొప్పున)పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు ప్రయోజనాలు 2020 వరకు అందుబాటులో ఉంటాయి. ఇటీవల జరిగిన ఈఎస్‌ఐ కార్పొరేషన్ 170వ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.