న్యూఢిల్లీ: భవిష్యనిధి(పీఎఫ్)పై ఇచ్చే వడ్డీరేటును 8.7 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సమర్థించుకుంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) నిధులపై వచ్చే ఆదాయం తక్కువగా ఉన్నందున అంతకుమించి ఇవ్వలేమంది. 8.7 శాతం ఇవ్వడానికే గతేడాది మిగిలిన మొత్తాన్ని వాడుకోవాల్సిన దుస్థితిలో ఉన్నామంది.మరోవైపు 8.8 శాతం వడ్డీ ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.