ముంబై : ఇటీవలే యూనికెమ్ ల్యాబోరేటరీస్‌ను కొనుగోలు చేసి, టాప్-5 ఫార్మా దిగ్గజంగా పేరు తెచ్చుకున్న టోరెంటో ఫార్మాస్యూటికల్స్, మరో యూరోపియన్ జనరిక్స్ బిజినెస్ యూనిట్ కొనుగోలుకు సిద్ధమైంది. సనోఫి యూరోపియన్ జనరిక్స్ బిజినెస్ జెంటివా ఎన్.వీని రూ.16వేల కోట్లకు టోరెంటో కొనుగోలు చేస్తున్నట్టు న్యూస్ రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఈ కొనుగోలులో టోరెంటో విజయం సాధిస్తే, కంపెనీకి అతిపెద్ద లావాదేవీ ఇదే కానుంది. ఫండింగ్ కోసం ఇప్పటికే టోరెంటో పలు దేశీయ, విదేశీ బ్యాంకులతో భాగస్వామ్యం కూడా ఏర్పరుచుకుంది. 28 మార్చి వరకు అన్ని ఫండింగ్ అరెంజ్‌మెంట్లు కూడా పూర్తి కానున్నాయి.
జెంటివాను సనోఫి 2009లో కొనుగోలు చేసింది. జెంటీవా ప్రస్తుతం యూరప్‌లో మూడో అతిపెద్ద జనరిక్స్ కంపెనీ. 50 మార్కెట్లలో జెంటివా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈబీఐటీడీఏల తర్వాత జెంటివా ఆదాయాలు 150 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. టోరెంటో ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న విలువ తన ఈబీఐటీడీఏల కంటే 13 సార్లు ఎక్కువగా ఉందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ సేల్ ప్రక్రియను విజయవంతంగా ముగించడానికి సనోఫి, జేపీ మోర్గాన్, రోథ్స్‌చైల్డ్ అండ్ కంపెనీ, మోర్గాన్ స్టాన్లీని నియమించుకుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment