మణిపాల్ హెల్త్‌లోటీపీజీకి వాటాలు | TPG acquires minority stake in Manipal Health | Sakshi
Sakshi News home page

మణిపాల్ హెల్త్‌లోటీపీజీకి వాటాలు

Published Fri, Feb 27 2015 2:11 AM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM

మణిపాల్ హెల్త్‌లోటీపీజీకి వాటాలు - Sakshi

మణిపాల్ హెల్త్‌లోటీపీజీకి వాటాలు

డీల్ విలువ రూ. 900 కోట్లు
న్యూఢిల్లీ: వైద్య సేవల రంగానికి చెందిన మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్‌లో అమెరికా ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ టీపీజీ వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ. 900 కోట్లు. దేశీయంగానే కాకుండా మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఆసియాన్ కూటమి దేశాల్లోనూ కార్యకలాపాలు విస్తరించేందుకు టీపీజీతో భాగస్వామ్యం తోడ్పడగలదని మణిపాల్  హెల్త్ ఎంటర్‌ప్రైజేస్ (ఎంహెచ్‌పీఈఎల్) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ స్వామి స్వామినాథన్ తెలిపారు.

మణిపాల్ గ్రూప్‌లో భాగమైన ఈ సంస్థకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో పది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే పలు ఫెర్టిలిటీ క్లినిక్స్, టీచింగ్ హాస్పిటల్స్‌ను కూడా నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement