ఉక్రెయిన్ సంక్షోభంతో గడ్డుకాలం | Ukraine as it happened: UN envoy chased in Crimea, Russia-US talks in Paris | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్ సంక్షోభంతో గడ్డుకాలం

Published Thu, Mar 6 2014 2:14 AM | Last Updated on Mon, Sep 17 2018 4:55 PM

ఉక్రెయిన్ సంక్షోభంతో గడ్డుకాలం - Sakshi

ఉక్రెయిన్ సంక్షోభంతో గడ్డుకాలం

రష్యా జోక్యంతో ఉక్రెయిన్‌లో రాజకీయ సంక్షోభం ముదిరిన కారణంగా సీఐఎస్ దేశాలతో భారత్ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావంపడే అవకాశముంది.

న్యూఢిల్లీ: రష్యా జోక్యంతో ఉక్రెయిన్‌లో రాజకీయ సంక్షోభం ముదిరిన కారణంగా సీఐఎస్ దేశాలతో భారత్ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావంపడే అవకాశముంది. రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెచ్చరిల్లితే ఆయా దేశాలతో ఇండియా వాణిజ్యం 15% తగ్గవచ్చని అసోచామ్ పేర్కొంది. ఈ  ఆర్థిక సంవత్సరం(2013-14)లో భారత్, ఉక్రెయిన్‌ల మధ్య వాణిజ్యం సుమారు 200 కోట్ల డాలర్ల వరకు ఉండవచ్చనీ, గతేడాది కంటే ఇది 36% తక్కువని తెలిపింది.

 సీఐఎస్ దేశాలకు అత్యధికంగా ఎగుమతులు చేసే ఫార్మా, విద్యుత్ యంత్రాల రంగాలపై సంక్షోభ ప్రభావం అత్యధికంగా ఉండవచ్చ ని అంచనా వేసింది. గత ఏప్రిల్ - జనవరి మద్యకాలంలో ఆయా దేశాలతో వాణిజ్యం 8% కు పైగా తగ్గిందని పేర్కొంది. ఉక్రెయిన్‌లోని తాజా పరిణామాలు భారతీయ ఎగుమతిదారులకు ఏమాత్రం మంచివి కావని ఇంజనీరింగ్ ఎగుమతిదారుల సంఘం (ఈఈపీసీ) చైర్మన్ అనుపమ్ షా అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement