సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో స్లీ ప్లేన్ సర్వీసుల ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని గంగా నది నుంచే శ్రీకారం చుట్టనున్నారు. భారత్‌లో తొలి రెగ్యులర్ సీప్లేన్ సర్వీస్ వారణాసి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉందని స్పైస్‌జెట్ ఛైర్మన్ అజయ్ సింగ్ చెప్పారు. నీటిలో, భూమిపై ల్యాండ్ కాగల ఈ తరహా విమానాలను వచ్చే ఏడాది నుంచి ప్రవేశపెడతామని లక్నో వంటి ప్రాంతాలకు సీప్లేన్ సర్వీసులు నడుపుతామని అన్నారు.
డిసెంబర్ 9న ముంబయి ఎయిర్‌పోర్ట్ నుంచి గిర్గామ్ చౌపట్టీ వరకూ సీప్లేన్ డెమోను స్పైస్‌జెట్ చేపట్టింది. అయితే మూడు రోజుల అనంతరం అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ సీప్లేన్ ఉపయోగించిన తర్వాత దీనికి ప్రచారం లభించింది. సీప్లేన్‌ల వాడకంపై పౌరవిమానయాన శాఖ మార్గదర్శకాలు జారీ చేసిన అనంతరం ప్రధాని నియోజకవర్గం నుంచే సీప్లేన్ సర్వీసులు ప్రారంభం కానుండటం గమనార్హం. సీప్లేన్ సర్వీసులను లాభదాయకంగా నిర్వహించడమే కీలకమని ఈ దిశగా తాము కసరత్తు సాగిస్తున్నామని అజయ్ సింగ్ తెలిపారు.
ఒక్కో సీప్లేన్‌కు దాదాపు రూ. 3 కోట్లు పైగా వ్యయమవుతుందని, తొలి దశలో 100 విమానాలకు తాము ఆర్డర్ చేశామని చెప్పారు. తమ రాష్ట్రాల్లో ఈ సేవలు అందించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమను సంప్రదించాయని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment