![భారత్‌లో 7 కోట్లు దాటిన వాట్స్‌యాప్ యూజర్లు](/styles/webp/s3/article_images/2017/09/2/61406573773_625x300_2.jpg.webp?itok=Uc_JwMpJ)
భారత్‌లో 7 కోట్లు దాటిన వాట్స్‌యాప్ యూజర్లు
ముంబై: దేశంలో మొబైల్ మెస్సెంజర్ సర్వీసు వాట్స్‌యాప్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారుల సంఖ్య ఏడు కోట్లు దాటింది. ప్రపంచమొత్తం మీద వాట్స్‌యాప్‌ను వాడుతున్నవారిలో 10 శాతం మంది భారత్‌లోనే ఉన్నారు.
నెలకు ఒక్కసారైనా వాట్స్‌యాప్‌ను వాడుతున్న క్రియాశీలక వినియోగదారులు 70 మిలియన్ల మంది ఉన్నారని ఈ మేరకు ఆదివారం వాట్స్‌యాప్ బిజినెస్ హెడ్ నీరజ్ అరోరా వెల్లడించారు.ఫేస్‌బుక్ టేకోవర్ చేసిన తర్వాత కూడా వాట్స్‌యాప్ తన ప్రత్యేకతను నిలుపుకొంటోందని, ప్రస్తుతం ఈ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా మొత్తం 60 కోట్ల మంది వాడుతున్నారని తెలిపారు.