అప్పు కొంత తీరుస్తా.. ఏమంటారు? | will repay 4000 crores for now, says vijay mallya | Sakshi
Sakshi News home page

అప్పు కొంత తీరుస్తా.. ఏమంటారు?

Published Wed, Mar 30 2016 12:36 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

అప్పు కొంత తీరుస్తా.. ఏమంటారు? - Sakshi

అప్పు కొంత తీరుస్తా.. ఏమంటారు?

పేరుకుపోయిన చావుబాకీలను తీర్చే విషయంలో బ్యాంకులతో తాము చర్చలు సాగిస్తున్నట్లు విజయ్ మాల్యా తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. మొత్తం రూ. 9 వేల కోట్ల వరకు అప్పులు ఉండగా వాటిలో రూ. 4 వేల కోట్లను సెప్టెంబర్‌లోగా చెల్లిస్తానని విజయ్ మాల్యా ఆఫర్ చేశారు. దాంతో బ్యాంకుల కన్సార్షియం ఈ ప్రతిపాదనకు స్పందించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.

కింగ్ ఫిషర్, యునైటెడ్ బ్రూవరీస్ లాంటి పలు వ్యాపారాలతో ఒక వెలుగు వెలిగిన విజయ్ మాల్యా.. ఆ తర్వాత పూర్తిగా అప్పులపాలై వ్యాపారాలన్నింటినీ దాదాపు వదులుకున్నారు. యునైటెడ్ బ్రూవరీస్ యాజమాన్యాన్ని కూడా వేరే విదేశీ సంస్థకు అప్పగించారు. వివిధ బ్యాంకులకు రూ. 9వేల కోట్ల వరకు బకాయి పడటంతో అతడిని దేశం వదిలి వెళ్లనివ్వకూడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం సుప్రీంను ఆశ్రయించినా, అప్పటికే ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. తాజాగా ఈ ప్రతిపాదన చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement