
బెంగళూరు: విప్రో కన్సూమర్ కేర్(డబ్ల్యూసీసీ) కంపెనీ, ఫిలిప్పైన్స్‌కు చెందిన పర్సనల్ కేర్ సంస్థ, స్లా్పష్ కార్పొరేషన్‌ను కొనుగోలు చేయనున్నది. ఈ మేరకు ఒక నిశ్చయాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని విప్రో కన్సూమర్ కేర్ వెల్లడించింది. తమ కంపెనీ కొనుగోలు చేస్తున్న 11వ కంపెనీ ఇదని డబ్ల్యూసీసీ సీఈఓ వినీత్ అగర్వాల్ పేర్కొన్నారు. డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఆయన వెల్లడించలేదు. స్లా్పష్ కార్పొరేషన్ మధ్య ఆసియా దేశాలతో పాటు థాయ్‌ల్యాండ్, మలేసియా, హాంకాంగ్, వియత్నాం, నైజీరియా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని అగర్వాల్ తెలిపారు. ఆసియాలోనే మూడో అతి పెద్ద పర్సనల్ కేర్ సంస్థగా అవతరించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ కంపెనీని కొనుగోలు చేస్తున్నామని వివరించారు. ఈ కంపెనీ కొనుగోలుతో ఫిలిప్పైన్స్ దేశంలో పర్సనల్ కేర్ విభాగంలో అగ్రస్థాయి కంపెనీగా అవతరిస్తామని పేర్కొన్నారు. స్లా్పష్ కంపెనీ ఆదాయం 8 కోట్ల డాలర్లని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment