
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ముద్రా పథకం కింద ప్రధానంగా లబ్ధి పొందుతున్నది మహిళలేనని, మొత్తం రుణాల్లో 75 శాతం వరకు వారికే మంజూరయ్యాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. విధానపరమైన చర్యల ద్వారా మరింత మంది మహిళలను వ్యవస్థీకృత రంగం వైపు రానున్నారని ప్రభుత్వం భరోసా ఇస్తున్నట్టు చెప్పారు. చిన్న వ్యాపారవేత్తలకు రూ.10 లక్షల వరకు రుణం ఇచ్చేందుకు కేంద్రం ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని నిర్వహిస్తున్న విషయం గమనార్హం.
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, మైక్రోఫైనాన్స్ సంస్థలు ఈ రుణాలను పంపిణీ చేస్తున్నాయి. ‘‘14 కోట్ల రుణాలను మంజూరు చేయగా... అందులో 75 శాతం మేర మహిళా వ్యాపారులకే వెళ్లాయి. భారత మహిళల్లో ఎంతో వ్యాపార ప్రతిభ దాగి ఉందని తెలియజేస్తోంది’’ అని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. టెక్స్‌టైల్స్ రంగంలో 70–75 శాతం మంది కార్మికులు మహిళలేనని తెలిపార
Comments
Please login to add a commentAdd a comment