Mudra scheme
-
రుణాల మంజూరులో తెలంగాణపై వివక్ష
సాక్షి, హైదరాబాద్: చిరు వ్యాపారులకు ఆర్థిక ఆసరాగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద ప్రవేశపెట్టిన రుణాల మంజూరు ప్రక్రియ రాష్ట్రంలో మందకొడిగా సాగుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన ఈ రుణాలివ్వాలని నిర్ణయించగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రానికి ముద్ర రుణ యూనిట్ల మంజూరు తక్కువగానే కనిపిస్తోంది. బీజేపీపాలిత రాష్ట్రాలకు మంజూరు చేసిన యూనిట్లతో పోలిస్తే రాష్ట్రానికి ముద్ర రుణాల విషయంలో కేంద్రం వివక్ష కనపరుస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు తెలంగాణలో కేవలం 40 లక్షల మందికే ఈ రుణాలు అందాయి. తెలంగాణకు చాలా తక్కువ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు చాలా తక్కువ ముద్ర రుణాలు మంజూరు అయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర జనాభా 3.85 కోట్లకుపైగా ఉండగా ఇప్పటివరకు కేవలం 40.90 లక్షల యూనిట్లే మంజూరు చేశారు. మనకంటే కేవలం 80 లక్షల జనాభా ఎక్కువగా ఉన్న ఒడిశాలో ఏకంగా 1.60 కోట్లకుపైగా ముద్ర రుణాలు వచ్చాయి. కర్ణాటకలో 2.45 కోట్లు, ఉత్తరప్రదేశ్‌లో 2.19 కోట్లు, మహారాష్ట్రలో 1.93 కోట్లు, మధ్యప్రదేశ్‌లో 1.49 కోట్లు, రాజస్తాన్‌లో 98 లక్షలు, మన జనాభాతో సమానంగా ఉన్న జార్ఖండ్‌లో 62 లక్షల యూనిట్లు మంజూరు చేశారు. దేశవ్యాప్త గణాంకాలను పరిశీలిస్తే మొత్తం 24 కోట్లకుపైగా యూనిట్ల ముద్ర రుణాలను డిసెంబర్ 31 వరకు మంజూరు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో రాష్ట్రానికి కేవలం 40లక్షల యూనిట్లే మంజూరవగా మరో 28 లక్షల మంది చిరువ్యాపారులు ఈ రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. జనాభా ప్రాతిపదికన చూస్తే దేశ సగటు 17.86 ఉండగా, తెలంగాణలో మాత్రం ప్రతి 100 మందిలో కేవలం 10.62 శాతం మందికి మాత్రమే ఈ రుణాలందాయి. కాగా, మన రాష్ట్రంలో ముద్ర రుణాల కోసం బ్యాంకులకు వెళుతున్న చిరు వ్యాపారులు నిరాశతో వెనుదిరిగాల్సి వస్తోందని ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమకు ఇచ్చిన లక్ష్యం అయిపోయిందని, అంతకు మించి తాము మంజూరు చేయలేమని బ్యాంకర్లు చెపుతున్నారని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని చిరువ్యాపారులను ఆదుకునేందుకు వీలున్నన్ని ముద్ర రుణాలు మంజూరు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ముద్ర రుణాలు ఎక్కువగా మంజూరయిన రాష్ట్రాలివే రాష్ట్రం జనాభా మంజూరైన రుణ యూనిట్లు అస్సాం 3,56,07,039 74,87,345 కర్ణాటక 6,75,62,686 2,45,02,287 కేరళ 3,56,99,443 84,01,668 ఒడిశా 4,63,56,334 1,63,01,350 పుదుచ్చేరి 14,13,542 6,80,997 తమిళనాడు 7,78,41,267 3,05,13,243 త్రిపుర 41,69,794 15,59,460 పశ్చిమ బెంగాల్ 9,96,09,303 2,41,95,057 (నోట్: ఈ వార్తకు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్రానికి రాసిన లేఖ బిట్‌ను యాడ్ చేసుకోగలరు.) ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో.. త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ముద్ర రుణాలు ఎక్కువగా మంజూరైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్ జనాభా దాదాపు 10 కోట్లు కాగా అందులో 2.41 కోట్ల యూనిట్ల ముద్ర రుణాలిచ్చారు. అలాగే లెఫ్ట్ ఫ్రంట్ పాలనలోని కేరళలో కూడా 3.5 కోట్ల జనాభాకు 84 లక్షలకుపైగా యూనిట్లు మంజూరయ్యాయి. తమిళనాడులో 7.78 కోట్ల జనాభాకు 3.05 కోట్ల యూనిట్ల రుణాలిచ్చారు. పుదుచ్చేరి జనాభా 14.13 లక్షలు కాగా అక్కడ 6.80 లక్షలు, 3.5కోట్ల జనాభా ఉన్న అసోంలో 74 లక్షల ముద్ర యూనిట్లు మంజూరవ్వడం గమనార్హం. -
ముద్రా పథకంలో మహిళలే ప్రధాన లబ్ధిదారులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ముద్రా పథకం కింద ప్రధానంగా లబ్ధి పొందుతున్నది మహిళలేనని, మొత్తం రుణాల్లో 75 శాతం వరకు వారికే మంజూరయ్యాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. విధానపరమైన చర్యల ద్వారా మరింత మంది మహిళలను వ్యవస్థీకృత రంగం వైపు రానున్నారని ప్రభుత్వం భరోసా ఇస్తున్నట్టు చెప్పారు. చిన్న వ్యాపారవేత్తలకు రూ.10 లక్షల వరకు రుణం ఇచ్చేందుకు కేంద్రం ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని నిర్వహిస్తున్న విషయం గమనార్హం. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, మైక్రోఫైనాన్స్ సంస్థలు ఈ రుణాలను పంపిణీ చేస్తున్నాయి. ‘‘14 కోట్ల రుణాలను మంజూరు చేయగా... అందులో 75 శాతం మేర మహిళా వ్యాపారులకే వెళ్లాయి. భారత మహిళల్లో ఎంతో వ్యాపార ప్రతిభ దాగి ఉందని తెలియజేస్తోంది’’ అని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. టెక్స్టైల్స్ రంగంలో 70–75 శాతం మంది కార్మికులు మహిళలేనని తెలిపార -
12 కోట్ల మందికి రూ.6 లక్షల కోట్ల రుణాలు
న్యూఢిల్లీ: ముద్రా పథకం కింద 12 కోట్ల మంది లబ్ధి దారులకు సుమారు రూ.6 లక్షల కోట్ల మేర రుణాలను అందజేయడం జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గత ప్రభుత్వం చిన్న వ్యాపారులకు చేసిందేమీ లేదని, తాము గత ప్రభుత్వం మాదిరిగా రుణ మేళాలు నిర్వహించకుండా, అర్హులకే రుణాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) పథకం ప్రజలు తమ కలలు నెరవేర్చుకునేందుకు సాయపడిందని, చిన్న వ్యాపార సంస్థల స్థాపన ద్వారా ఉపాధి కల్పనకు తోడ్పడినట్టు ప్రధాని వివరించారు. పీఎంవైవై కార్యక్రమాన్ని ప్రధాని మోదీ 2015 ఏప్రిల్ 8న ప్రారంభించారు. కార్పొరేట్ రంగానికి కాకుండా, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ సంస్థలకు ఒక్కో దానికి రూ.10 లక్షల వరకు రుణ సాయం అందజేయడం కార్యక్రమ ఉద్దేశ్యం. దేశవ్యాప్తంగా ఈ పథకం లబ్ధిదారులను ఉద్దేశించి ప్రధాని మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘‘25–30 ఏళ్ల క్రితం రాజకీయ ప్రయోజనాల కోసం రుణ మేళాలు నిర్వహించేవారు. రాజకీయ నాయకులకు సన్నిహితులైన వారికే రుణాలు లభించేవి’’ అని మోదీ పేర్కొన్నారు. కానీ ఎన్డీయే సర్కారు మాత్రం ఎటువంటి రుణ మేళాలు నిర్వహించలేదని, దళారులకు చోటివ్వలేదని చెప్పారు. పేదవారు, చిన్న వ్యాపారులు బ్యాంకుల వద్ద ఎలాంటి హామీ లేకుండానే రుణాలు పొందేలా ముద్రాను రూపొందించినట్టు చెప్పారు. 9 కోట్ల మంది మహిళలే... ముద్రా స్వయం ఉపాధి అవకాశాలను కల్పించిందని, దాంతో ఉద్యోగావకాశాలు పెరిగాయన్నారు. 12 కోట్ల మందికి రూ.6 లక్షల కోట్ల రుణాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఈ 12 కోట్ల మందిలో 28 శాతం మంది మొదటి సారి వ్యాపారవేత్తలేనని తెలిపారు. ఇక 74 శాతం మంది (9 కోట్ల మంది) మహిళలు ఉండగా, మొత్తం లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు 55 శాతం వరకు ఉన్నారని చెప్పారు. -
మసక ‘ముద్ర’
సాక్షి, ఆదిలాబాద్ : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాలను స్థాపించుకునేందుకు, నిలదొక్కుకునేందుకు, విస్తరించుకునేందుకు ఆర్థిక చేయూతగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం జిల్లాలో మసకబారి అభాసుపాలవుతోంది. ఈ పథకం ప్రారంభమైన మూడేళ్లలో జిల్లాలో ఇచ్చింది అరకొర మాత్రమే. ఈ రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు నిరాసక్తత చూపిస్తున్నారు. రికవరీ జరగడం లేదా మరేమో గానీ ‘ముద్ర’ మాటెత్తడానికే బ్యాంకర్లు ఆసక్తి కనబర్చడం లేదు. బడా వ్యాపారులు బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టినా చోద్యం చూసే బ్యాంకర్లు చిరువ్యాపారులపై మాత్రం కఠినంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చింది అరకొరే.. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) కింద కేంద్ర ప్రభుత్వం ఏటా పెద్ద ఎత్తున రుణాలు ప్రకటిస్తుంది. నాబార్డ్ ద్వారా ప్రకటించే జిల్లా వార్షిక ప్రణాళికలోనూ వ్యవసాయ పంట రుణాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణలక్ష్యం తర్వాత ఎంఎస్ఎంఈ కింద పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుంది. ముద్ర రుణాలు కూడా ఇందులో భాగమే. ఈసారి ఎంఎస్ఎంఈ కింద జిల్లాకు మరో 10 శాతం రుణ లక్ష్యం పెంచారు. ముద్ర రుణాలను 2015 ఏప్రిల్ 8న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మూడేళ్లలో జిల్లాలో ఇచ్చింది అరొకర మాత్రమే. ప్రధానంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారులకు ఆ రంగంలో రాణించేందుకు వీలుగా మూడు వేర్వేరు పథకాలు శిశు కింద రూ.50వేలు, కిశోర్ కింద రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు, తరున్ కింద రూ.10లక్షల వరకు రుణాలు అందజేసే వీలుంది. శిశు కింద కొత్త రుణాలు ఇవ్వడం, కిశోర్ కింద వ్యాపారంలో నిలదొక్కుకునేందుకు, తరుణ్ కింద నిలదొక్కుకొని వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలను బట్టి ఈ రుణాలు ఇవ్వాలి. ప్రధానంగా ముద్ర రుణాలకు సంబంధించి బ్యాంక్ వారీగా టార్గెట్లు ఉండడంతో జిల్లా లక్ష్యం ఎంత అన్నదానిపై స్పష్టతలేదు. అయితే ముద్ర రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముభావం ప్రదర్శిస్తున్నారని పలువురు చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తులు, షూరిటీలు అవసరం లేకుండానే సొంతపూచికత్తుపై ఈ రుణాలు ఇచ్చే వీలుంది. బ్యాంకులకు వెళ్తున్న పలువురు వ్యాపారులకు బ్యాంకర్ల నుంచి మొండి చెయ్యే ఎదురవుతుంది. అనేకమార్లు బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేసినా కనికరించడం లేదు. దీంతో చేసేదేమి లేక వారు నిరాసక్తతతో వెనుదిరుగుతున్నారు. డీఎల్ఆర్సీలో చర్చ.. ఇటీవల రాష్ట్ర మంత్రి జోగురామన్న, కలెక్టర్ దివ్యదేవరాజన్ అధ్యక్షతన బ్యాంకర్లతో నిర్వహించిన జిల్లాస్థాయి రివ్యూ కమిటీ (డీఎల్ఆర్సీ) సమావేశంలో ముద్ర రుణాలపై చర్చకొచ్చింది. ప్రధానంగా ఈ రుణాలివ్వడంలో బ్యాంకర్ల తీరుపై డీఎల్ఆర్సీ విస్మయం వ్యక్తం చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం గడువు మరో నెలన్నరలో ముగియనున్న నేపథ్యంలో అప్పటికైనా కొంత పరిస్థితిలో మార్పు రావాలని హెచ్చరించడం జరిగింది. ప్రధానంగా ప్రతీ బ్యాంకు ఫిబ్రవరిలో ఐదు అకౌంట్లు, మార్చిలో మూడు అకౌంట్లు ముద్ర రుణాలవి తెరవాలని చెప్పడం జరిగింది. జిల్లాలో ఇప్పటివరకు 2,560 అకౌంట్లు ముద్ర రుణాల కింద ఉన్నాయి. ఒకవేళ డీఎల్ఆర్సీ సమావేశానికి అనుగుణంగా కొత్త అకౌంట్లు తెరిచిన పక్షంలో ఈ సంఖ్య 3,288కి పెరిగే అవకాశం ఉంది. ఎంఎస్ఎంఈ కింద రుణ లక్ష్యం.. 2017–18 రూ. 144.62 కోట్లు 2018–19 రూ. 161.56 కోట్లు పెరిగిన శాతం 10.55 శాతం ముద్ర రుణాలు.. (మూడేళ్లలో రుణం, అందజేసిన అకౌంట్ల వివరాలు) స్కీం అకౌంట్లు ఇచ్చిన రుణం (రూ.కోట్లలో) శిశు 1345 6.64 కిషోర్ 1177 17.05 తరున్ 38 2.71 మొత్తం 2560 26.41 -
లక్ష్యాలు దాటిన ‘ముద్రా’ రుణాలు
2016–17లో రూ.1.80 లక్షల కోట్లకుపైగా మంజూరీలు న్యూఢిల్లీ: స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ముద్రా (మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైన్స్ ఏజెన్సీ లిమిటెడ్– ఎంయూడీఆర్‌ఏ) పథకం కింద బ్యాంకులు లక్ష్యాలను మించి రుణాలను అందజేశాయి. గడచిన ఆర్థిక సంవత్సరం అసంఘటిత రంగానికి బ్యాంకులు ఈ పథకం కింద రూ.1.80 లక్షల కోట్లకుపైగా రుణాలను అందజేశాయి. 2016–17లో నిజానికి రుణ పంపిణీ లక్ష్యం రూ.1.80 లక్షల కోట్లు. అయితే ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం, మార్చి నాటికి రూ.1,80,087 కోట్లుగా నమోదయినట్లు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంకా కొన్ని చిన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి సమాచారం రావాల్సి ఉందని కూడా ఈ ప్రకటన వివరించింది. ఈ సమాచారం కూడా అందితే గత ఆర్థిక సంవత్సరం రుణ మంజూరీల పరిమాణం మరింత పెరిగే వీలుంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం చూస్తే, ఈ పథకం కింద బ్యాంకులు మంజూరు చేసిన మ్తొతం రూ. 1,23,000 కోట్లయితే, నాన్–బ్యాంకింగ్ సంస్థలు రూ. 57,000 కోట్ల రుణ మంజూరీలు చేశాయి. 2015 ఏప్రిల్‌లో ‘ఫండ్ ది అన్‌ఫండెడ్’ పేరుతో ప్రధాని నరేంద్రమోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. చిన్న పరిశ్రమలు రూ.50,000 నుంచి రూ.10 లక్షల వరకూ ఈ పథకం పరిధిలోని శిశు, కిషోర్, తరుణ్ విభాగాల కింద రుణం పొందే సౌలభ్యం ఉంది.