వాషింగ్టన్: అవినీతి చర్యలకు పాల్పడిన పలు భారత కంపెనీలపై ప్రపంచ బ్యాంకు నిషేధం విధించింది. మోసపూరిత విధానాలకు పాల్పడిన మధుకాన్ ప్రాజెక్ట్స్‌పై రెండేళ్ల వేటు పడింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు నామా నాగేశ్వరరావుకు చెందిన ఈ కంపెనీ... భారత్‌లో ప్రపంచ బ్యాంకుకు చెందిన ప్రాజెక్టులకు పనిచేస్తోంది. భారత్‌కు చెందిన ఓలివ్ హెల్త్‌కేర్, జే మోది కంపెనీలు బంగ్లాదేశ్‌లో ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు కింద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
ఇవి మోసం, అవినీతి చర్యలకు పాల్పడడంతో నిషేధం విధించినట్టు ప్రపంచ బ్యాంకు వార్షిక నివేదిక తెలియజేసింది. ఓలివ్ హెల్త్‌కేర్‌పై పదేళ్లు, జైమోదిపై ఏడున్నరేళ్ల పాటు ఈ నిషేధం అమలుకానుంది. మొత్తం 78 కంపెనీలు, వ్యక్తులపై ప్రపంచ బ్యాంకు ఈ చర్యలు తీసుకుంది. భారత్‌కే చెందిన ఏంజెలిక్యూ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌పై నాలుగున్నరేళ్లు, ఫ్యామిలీ కేర్‌పై నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది. ఆర్‌కేడీ కన్‌స్ట్రక్షన్స్‌పై ఏడాదిన్నరపాటు వేటు వేసింది. తత్వ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ప్రైవేటు లిమిటెడ్, ఎస్‌ఎంఈసీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, మెక్‌లియోడ్స్ ఫార్మాస్యూటికల్స్‌పై ఏడాదిలోపు నిషేధం విధించింది.
పలు భారత కంపెనీలపై ప్రపంచ బ్యాంకు నిషేధం
Published Fri, Oct 5 2018 1:39 AM | Last Updated on Fri, Oct 5 2018 1:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment