చందాదారులకే ఆప్షన్లిస్తాం: జలాన్
న్యూఢిల్లీ : భవిష్య నిధిలో జమయ్యే మొత్తాలను ఎందులో ఇన్వెస్ట్ చేయాలనే నిర్ణయాన్ని చందాదారులకే వదిలిపెట్టే అవకాశాలున్నాయని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కేకే జలాన్ చెప్పారు. ఏడాది, రెండేళ్లలో ఈ మేరకు ఆప్షన్లు ఇవ్వొచ్చని ఆయన పేర్కొన్నారు. ఈక్విటీలకు పెద్ద పీట వేస్తూ 3-4 సాధనాలతో పెట్టుబడి మోడల్స్‌ను ఈపీఎఫ్‌వో రూపొందించనుందని అసోచాం సదస్సులో పాల్గొన్న సందర్భంగా జలాన్ తెలియజేశారు.
స్టాక్ మార్కెట్లో ఈపీఎఫ్‌వో నిధులను ఇన్వెస్ట్ చేయాలన్న నిర్ణయం పూర్తిగా ఆర్థిక శాఖదేనని కూడా ఆయన తెలిపారు. అటు, చందాదారులు తక్కువ ఖరీదు ఇళ్లను గృహాలను కొనుగోలు చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక కమిటీ నివేదిక ఇచ్చిందని, దీన్ని త్వరలోనే సమీక్షిస్తామని ఆయన పేర్కొన్నారు.
మీ పీఎఫ్ ఎందులో పెట్టుబడి పెట్టాలి?
Published Sat, Aug 1 2015 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM
Advertisement