
సాక్షి, తిరుమల: కేన్సర్ ఆస్పత్రి నిర్మాణంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో భాగస్వామ్యం కావటం గొప్పవరమని టాటా సంస్థల మాజీ చైర్మన్ రతన్ టాటా అన్నారు. సోమవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవటం మహదానందంగా ఉందన్నారు.
కాగా, రతన్‌టాటా, టాటా సంస్థల ప్రస్తుత చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌కు తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ప్రత్యేక దర్శనం కల్పించారు. పండితులు వేద ఆశీర్వాదంతో పాటు శ్రీవారి పట్టువస్త్రంతో సత్కరించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా ఉన్నారు.