
లండన్ : ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా దాదాపు 20 ఏండ్లపాటు ఆయన అకృత్యాలకు అంతలేకుండా పోయింది. పైకి పెద్ద మనిషిలా చెలామణి అవుతూ హాలీవుడ్ చిత్ర నిర్మాణ రంగంలో మూవీ మొగల్‌గా వెలుగొందుతూ హర్వే వెయిన్‌స్టన్ పెద్ద చీకటి రాజ్యమే నడిపాడు. యువతుల, మహిళల అవసరాలు, కలలను అవకాశంగా తీసుకొని తనకు నచ్చినట్లుగా వారితో ప్రవర్తించాడు. ఒప్పుకుంటే మంచిగా లేదంటే వార్నింగ్‌లు, దాడి చేయించే సంఘటనలు, కెరీర్‌లేకుండా చేసే పనులతో దాదాపు తేనెపూసిన కత్తిలా ప్రవర్తించాడు. ఇలా దాదాపు ఒకరు కాదు ఇద్దరు కాదు.. హాలీవుడ్‌ని ప్రముఖ నటీమణులు 40మంది వరకు అతడి బాధితులే. ఉదాహరణకు ఎంజెలినా జోలి, గైనెత్ పాల్ట్రో, లియా సెడాక్స్, కేట్ బెక్కిన్సేల్ ఇలా చెప్పకుంటూ వెళితే అంతా ప్రముఖులే..
ఇంకా బయటకు కనిపించని వాళ్లు.. ధైర్యంగా తమకు జరిగిన అనుభవాలను వెల్లడించని వారు పదుల సంఖ్యలో ఉన్నారు. 1990 దశకంలో మొదలుకొని ఇప్పటి వరకు హాలీవుడ్ చిత్రసీమలోకి అడుగుపెట్టిన ప్రతి మగువను అతడు ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తోంది. సినిమా కథలు చర్చిద్దాం రండి అని చెప్పి వారు వచ్చే సమయానికి అతడు బాత్ రూమ్‌లో నగ్నంగా ఉండి లోపలికి పిలిచేవాడంట. అతడి ప్రవర్తనను ముందే పసిగట్టి తాము బయటపడేవాళ్లమని వారంతా దాదాపు ఒకే అనుభవం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment