
లండన్ : తాను చెప్పినట్లు వినకపోతే తనకు జీవితమే లేకుండా చేస్తానని బెదిరించాడని ప్రముఖ హాలీవుడ్ నటి ఈవా గ్రీన్ హాలీవుడ్ నిర్మాత, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హార్వే వెయిన్‌స్టన్‌పై ఆరోపించింది. అయితే, ఆరోజు తాను ఏదోలా బయటపడి తప్పించుకున్నానని, లేదంటే జీవితాంతం మర్చిపోలేని సంఘటన జరిగి ఉండేదని తన అనుభవం వెల్లడించింది. ఇప్పటికే హాలీవుడ్‌లోని నటీమణులంతా ఏకకాలంలో హార్వేపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాండ్‌తోసైతం నటించిన ఈవా తన అనుభవాన్ని తాజాగా పంచుకున్నారు.
'అందరితో చెప్పినట్లుగానే నాతో కూడా అదే విషయం చెప్పాడు. సినిమా స్క్రిప్టు గురించి మాట్లాడుకుందాం రావాలని పిలిచాడు. వృత్తి నేపథ్యంలోనే సమావేశం కావడంతో నేను కూడా వెళ్లాను. అతడి హోటల్‌లోనే కార్యాలయం కూడా ఉంది. ఆ రోజు నేను ఆయనను అనుసరిస్తూ వెళ్లాను. అక్కడికి వెళ్లాక అతడి దుస్తులు విప్పేసి మసాజ్ చేసేందుకు రమ్మన్నాడు. నేను ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించాను. ఆయన చెప్పినట్లు వినాలని బెదిరించారు. లేదంటే నాకు జీవితమే లేకుండా చేస్తానని బెదిరించారు. నేను అవన్నీ పట్టించుకోకుండా పారిపోయి వచ్చాను' అని తన భయంకర అనుభవం చెప్పుకుంది.
Comments
Please login to add a commentAdd a comment