
మక్లూరు: నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం మామిడిపల్లి వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొని ఆపై రోడ్డు పక్కనే ఉన్న గోడను ఢీకొట్టి హోటల్‌లోకి చొచ్చుకెళ్లింది. ఈ ఘటనలో మొత్తం 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆటో డ్రైవర్‌కు కాళ్లు విరిగిపోయాయి. ఓ మహిళ కంటికి తీవ్రగాయమైంది. హోటల్‌లో ఉన్న మరో ఆరుగురు గాయాలపాలయ్యారు.
క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్ మద్యం సేవించి కారు నడిపారని స్థానికులు చెబుతున్నారు. నిందితులతో స్థానిక గ్రామస్తులు వాగ్వివాదానికి దిగారు. పరిస్థితి చేయిదాటేలా కనిపించడంతో పోలీసులు కారులో ఉన్న వాళ్లను మక్లూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment