వీఆర్వో సుశీలను విచారిస్తున్న అధికారులు పట్టుబడ్డ వీఆర్వో సుశీల
తాంసి(బోథ్): మండలంలోని కప్పర్ల గ్రామ వీఆర్‌వోగా పనిచేస్తున్న సుశీల శుక్రవారం గ్రామంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది. పాలోది గ్రామానికి చెందిన జాజిమొగ్గల ఆశమ్మ తనకున్న పంటపొలం తమ కుమారుడు శ్రీనివాస్ పేరుమీద మార్పిడి చేయాలని వీఆర్‌వోను ఆశ్రయించింది. అందుకు సుశీల రూ.13వేలు డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు శ్రీనివాస్ ఏసీబీని ఆశ్రయించాడు. పాలోది గ్రామానికి చెందిన జాజిమొగ్గల ఆశమ్మ పేరు మీద ఉన్న ఎనిమిది ఎకరాల పొలాన్ని తమ కూమారుడు జాజిమొగ్గల శ్రీనివాస్ పేరుమీద పట్టా మార్పిడి చేయడానికి వీఆర్వో సుశీలను ఆశ్రయించారు.
ఇందుకు వీఆర్వో తమను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా రూ.13 వేల నగదును డిమాండ్ చేసింది. దీంతో మొదటి విడతలో రూ.4వేలు అందించారు. అయినా పాస్‌పుస్తకం అందించకుండా మిగతా రూ.9 వేల నగదును డిమాండ్ చేయడంతో పాటు ఇబ్బందులకు గురిచేయడంతో బాధితుడు శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం శుక్రవారం నగదుతో సహా వీఆర్వోను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీబీ డీఎస్పీ ప్రతాప్, సీఐలు రవీందర్, వేణుగోపాల్, ప్రశాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment