వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ డీఎస్పీ రంగరాజు ఏసీబీకి చిక్కిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవి
భీమునిపట్నం: జీవీఎంసీ భీమిలి జోన్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఆర్.రవి శుక్రవారం తన ఛాంబర్‌లో రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కె.రంగరాజు తెలియజేసిన వివరాల ప్రకారం... స్థానిక పాత బస్టాండ్ వద్ద గతంలో మూతపడిన శ్రీనివాస థియేటర్‌కు చెందిన గొడౌన్‌లో ఉత్తమ్ ఫుడ్స్ అనే సంస్థ చిన్న పిల్లల కోసం విక్రయించే తినుబండారాలు తయారు చేస్తుంది. ఈ సంస్థకు ట్రేడ్ లైసెన్స్ లేని కారణంగా మే 17న జోనల్ కమిషనర్ సీహెచ్ గోవిందరావు సీజ్ చేశారు.
తరువాత శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవి ఫుడ్స్ యాజమాన్యాన్ని బెదిరించి తనకు అధికారం లేకపోయినా నూనె డబ్బాలను సీజ్ చేశాడు. నూనెను తనిఖీల కోసం పంపిస్తానని వీరిని బెదిరించేవాడు. తనకు రూ.10వేలు ఇస్తే కేసులు లేకుండా చూస్తామని చెప్పడంతో వీరు రూ.5వేలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. అనంతరం శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫుడ్స్ యాజమాన్యం తరపున కొల్లూరు సూర్య మణికంఠ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవిని అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. డీఎస్పీ రంగరాజుతో పాటు సీఐలు ఎంవీ గణేష్, రమణమూర్తి, లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment