ఫేస్‌బుక్‌లో ప్రియురాలి నగ్నచిత్రాలు.. ఫోన్ నెంబర్! | Accused arrested for uploading women private photos | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో ప్రియురాలి నగ్నచిత్రాలు.. ఫోన్ నెంబర్!

Published Thu, Sep 28 2017 8:56 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

Accused arrested for uploading women private photos - Sakshi

సాక్షి, బెంగళూరు:  తనతో సంబంధాన్ని కొనసాగించలేదనే అక్కసుతో ప్రియురాలిపై ఆగ్రహం పెంచుకున్నాడు. ప్రియురాలి నగ్నచిత్రాలను ఫేస్‌బుక్‌లో పెట్టి, ఆమె వ్యభిచారి అని పేర్కొంటూ ఫోన్‌ నెంబర్‌ కూడా ఆ కామాంధుడు పోస్ట్‌ చేశాడు. బెంగళూరుకు చెందిన ఆ నిందితుడిని ముంబయి పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. బెంగళూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో శోవిక్‌ భువన్‌ (22) అనే యువకుడు బీబీఎం రెండో ఏడాది చదువుతున్నాడు. అసోంకు చెందిన ఓ యువతి స్థానికంగా ఉంటోంది.

ఆమెకు శోవిక్‌తో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది. ఆ సమయంలో ఇద్దరు కలిసి చాలా సన్నిహితంగా ఫొటోలు దిగారు. కొంతకాలం కిందట ఆమె ఉద్యోగ నిమిత్తం ముంబయికి వెళ్లిపోయింది. అప్పటినుంచి భువన్‌తో మాటామంతీ తగ్గిపోయింది. అతడు తరచూ ఫోన్‌ చేసి తనతో సంబంధాన్ని కొనసాగించాలని ఒత్తిడి చేయగా, ఇందుకు ఆమె నిరాకరించింది. కోపోద్రిక్తుడైన శోవిక్‌ ఆమెపై పగ పెంచుకున్నాడు. ఆమె నగ్నంగా ఉన్న ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. అంతేకాకుండా ఆమె వేశ్య అని, ఎవరైనా సంప్రదించవచ్చునంటూ ఏకంగా ఆమె ఫోన్‌ నెంబరునూ పోస్ట్ చేశాడు.

ఇది తెలిసిన బాధితురాలు సోమవారం తన ప్రియుడిపై ముంబయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ముంబయి డీసీపీ నవీన్‌ చంద్రారెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ శైలేష్‌ పసాల్హర్‌ నేతృత్వంలో బృందాన్ని పంపారు. బుధవారం ముంబయి నుంచి ప్రియురాలు వచ్చి పలానాస్థలంలో వేచి చూస్తున్నట్లు పథకం రూపొందించిన పోలీసులు.. భువన్ అక్కడికి రాగానే అరెస్ట్‌ చేశారు. ఆ కామాంధుడు 20కి పైగా యువతి నగ్నఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అక్కడినుంచి ముంబయికి తరలించి విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement